Asaduddin Owaisi: అజారుద్దీన్ ఓ ‘ఫెయిల్యూర్ పొలిటీషియన్’.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
Asaduddin Owaisi On Azharuddin: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ప్రధాన పార్టీలన్నీ రణక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. నేతలు మాటల తూటాలతో మరింత వేడిపుట్టిస్తున్నారు. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Asaduddin Owaisi On Azharuddin: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ప్రధాన పార్టీలన్నీ రణక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. నేతలు మాటల తూటాలతో మరింత వేడిపుట్టిస్తున్నారు. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుడిగా మహ్మద్ అజారుద్దీన్ విఫలమయ్యాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అజారుద్దీన్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూనే.. అతనిపై జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థిని పోటీ చేయించడంపై ఓవైసీ సమర్థించుకున్నారు. ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన ‘తెలంగాణ రౌండ్ టేబుల్’ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ నుంచి తొలిసారిగా అభ్యర్థిని నిలబెట్టడానికి కారణం.. మాజీ క్రికెటర్‌పై ‘వ్యక్తిగత శత్రుత్వం’ అనే వాదనలను హైదరాబాద్ ఎంపీ తిరస్కరించారు. “అజారుద్దీన్ ఇద్దరు తమ్ముళ్లు నాకు చాలా మంచి స్నేహితులు. అజారుద్దీన్ దివంగత తండ్రి అసదుద్దీన్ ఒవైసీకి వీరాభిమాని. జూబ్లీహిల్స్‌లో, మాకు (AIMIM) ఇద్దరు మున్సిపల్ కార్పొరేటర్లు ఉన్నారు. అక్కడ మా సొంత పార్టీ బలం ఉంది’ అంటూ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.
2009లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి లోక్‌సభ ఎంపీగా పనిచేసిన అజారుద్దీన్‌ను గుర్తు చేస్తూ.. అజార్ “రాజకీయ నాయకుడిగా విఫలం” అంటూ ఓవైసీ అభివర్ణించారు. “క్రికెట్ బ్యాట్‌తో అతను అద్భుతాలు చేశాడు. ఆ మణికట్టు షాట్‌లు చూడటానికి చాలా ఆనందంగా ఉంటాయి” .. అంటూ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో పోటీకి దిగాలన్న ఏఐఎంఐఎం ఆలోచన ముస్లిం ఓట్లను చీల్చడమేనన్న వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. జూబ్లీహిల్స్‌లో 1,17,972 మంది మైనారిటీ కమ్యూనిటీ ఓటర్లు ఉన్నారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తోంది.. అజారుద్దీన్..
తెలంగాణలో బీజేపీ ప్రభావం అసలు లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తోందని మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ బుధవారం పేర్కొన్నారు. వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడిన మహ్మద్ అజారుద్దీన్.. “ఇక్కడ మా పార్టీ బలంగా ఉంది. ఇక్కడ బీజేపీ ప్రభావం అంతగా లేదు. కాంగ్రెస్ హవా ఉంది. కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు.’’ అంటూ పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలలో, జూబ్లీహిల్స్ ప్రాంతంలో (హైదరాబాద్) అభివృద్ధి శూన్యమంటూ విమర్శలు గుప్పించారు.
చతుర్ముఖ పోటీ..
జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను నిలబెట్టాయి.. ఏఐఎంఐఎం కూడా ఇక్కడ పోటీకి దిగడంతో గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ అజారుద్దీన్‌ను, ఏఐఎంఐఎం పార్టీ కార్పొరేటర్ మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌ను బరిలోకి దించగా, బీఆర్‌ఎస్ మరోసారి ప్రస్తుత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను రంగంలోకి దింపింది. బీజేపీ నియోజకవర్గం నుంచి ఎల్.దీపక్‌రెడ్డి పేరును ప్రతిపాదించింది. కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 న జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..