Telangana Police: పోలీసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆ రోజుల్లో ప్రత్యేక సెలవులు
రాష్ట్రంలోని పోలీస్ అధికారులకు తెలంగాణ డీజిపి శివధర్ రెడ్డి అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల పాటు శాంతిభద్రతలు కాపాడే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులకు పుట్టిన రోజు, పెళ్లి రోజు ప్రత్యేక సెలవులు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. విధి నిర్వాహణలో పడి పోలీసులకు తమ ఫ్యామిలీస్‌కు సమయం ఇవ్వట్లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

తెలంగాణ పోలీసు శాఖలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ వ్యక్తిగత జీవితానికి దూరమవుతున్న పోలీసుల కోసం ఆయన ఒక తీపి కబురు అందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమై, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో కూడా కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్న పోలీసుల కోసం డీజీపీ ప్రత్యేక సెలవులను ప్రకటించారు.
పోలీసులకు బర్త్‌డే, మ్యారేజ్‌డే గిఫ్ట్
ఇకపై ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ పుట్టినరోజు, పెళ్లి రోజు నాడు కుటుంబంతో గడిపేందుకు ప్రత్యేక సెలవు పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. సమాజ రక్షణ కోసం వారు తమ వ్యక్తిగత సంతోషాలను త్యాగం చేస్తున్నారు. వారి మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని, కనీసం జీవితంలోని ముఖ్యమైన రోజుల్లోనైనా కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
పోలీసుల హర్షం
అయితే పోలీసుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం, డీజిపీ తీసుకున్న ఈ నిర్ణయంపై అటు రాష్ట్ర పోలీస్ బలగాల సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన డ్యూటీతో పాటు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పనితీరు మరింత మెరుగుపడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
