TG 10th Class Results 2026: రేపే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల.. మే లో కాదు ఈ నెలాఖరుకే!
TG SSC 10th Class Results 2026 Result Date and Time: లక్షలాది మంది పదో తరగతి విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. నిన్నమొన్నటి వరకు మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావించినప్పటికీ ఏప్రిల్ నెలాఖరుకే ఫలితాలు విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ క్రమంలో తాజా అప్‌డేట్..

హైదరాబాద్, ఏప్రిల్ 28: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పదో తరగతి విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. నిన్నమొన్నటి వరకు మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావించినప్పటికీ ఏప్రిల్ నెలాఖరుకే ఫలితాలు విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ క్రమంలో తాజా అప్‌డేట్ జారీ చేసింది. పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 29 లేదా 30 తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన ఈ రోజు లేదా రేపు వెలువడే ఛాన్స్ ఉంది.
కాగా తెలగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్ 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. తొలుత మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు భావించారు. అయితే ఈ నెలాఖరుకే అంటే ఏప్రిల్ 29 లేదా 30న విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఫలితాల వెల్లడికి రేవంత్ సర్కార్ అనుమతి కూడా తెలిపినట్లు సమాచారం. అన్ని కుదిరితే ఏప్రిల్ 29వ తేదీనే పదో తరగతి ఫలితాలు వెలువడతాయి. ఒకవేళ వీలుకాకపోతే ఏప్రిల్ 30న వెల్లడిస్తారు. ఇంటర్ ఫలితాల మాదిరి పదో తరగతి ఫలితాలు కూడా ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చేతుల మీదగా విడుదల చేయనున్నారు.
పదో తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత ఎస్సెస్సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్‌లోనూ తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. అలాగే టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా నేరుగా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సప్ ద్వారా రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే 80969 58096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపించి, ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్‌చేసి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయాలి. అంతే వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




