AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Govt Jobs 2026: డిగ్రీ అర్హతతో తెలంగాణలో అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.1,24,150 జీతం

రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. డిగ్రీ అర్హతతో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతలు, ఎంపిక విధానం, అప్లికేషన్ లింక్ ఈ కింద చెక్ చేసుకోండి..

TGPSC Govt Jobs 2026: డిగ్రీ అర్హతతో తెలంగాణలో అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.1,24,150 జీతం
TGPSC Assistant Scientist Jobs
Srilakshmi C
|

Updated on: Apr 28, 2026 | 6:20 AM

Share

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ 2) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 20 అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ 2) పోస్టులను రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 27, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

టీజీపీఎస్‌సీ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2026 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 25, 2026లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

టీజీపీఎస్‌సీ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఓటీఆర్‌ అప్‌డేట్‌ తప్పనిసరి

టీజీపీఎస్సీ జారీ చేసే నోటిఫికేషన్లకు వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌‌డేట్‌ తప్పనిసరిగా చేసుకోవాలని ఇప్పటికే టీజీపీఎస్సీ పేర్కొంది. అయితే చాలామంది నిరుద్యోగులు మాత్రం పూర్తి స్థాయిలో అప్‌డేట్ చేసుకోలేదు. తెలంగాణలో సుమారు 30 లక్షల మంది ఓటీఆర్ ఉంది. వారిలో కేవలం 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్‌‌‌‌గా పలు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓటీఆర్ అప్‌‌డేట్ చేసుకోవడానికి మరోమారు తుది గడువును పొడిగించారు. కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా ఓటీఆర్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కాలుష్య నియంత్రణ మండలిలో త్వరలోనేమరో 6, 7 రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది.

టీజీపీఎస్‌సీ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us