Health Tips: పళ్లు తోమకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుంది.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఈ భూమిపై జన్మించిన ఒక్కో మనిషికి ఒక్కొ రకం అలవాట్లు ఉంటాయి. ఒక మార్నింగ్ లేచిన వెంటనే పళ్లు తోమకుండా నీరు తాగితే, మరికొందరేమో పూర్తి ముఖం కడుక్కున్న తర్వాతే నీరు లేదా ఇతర ఏదైనా ఆహారం తీసుకుంటారు. అయితే మార్నింగ్ పళ్లు తోమకుండా నీరు తాగుతే ఏమవుతుందో అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. కాబట్టి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం పళ్లు తోమకుండా నీళ్లు తాగడం మంచిది కాదని చాలా మంది అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ పళ్లు తోముకోవడానికి ముందే నీరు త్రాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలు బయటకు వెళ్లిపోయి, రక్తం శుద్ధి అవుతుందట. ఇది శరీర జీవక్రియ రేటును పెంచి, జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేసేలా చేస్తుందట. ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల ప్రేగు కదలికలు సులువై, మలబద్ధకం వంటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోతాయి. అలానే చర్మానికి అవసరమైన తేమ కూడా అంది ముఖం కాంతివంతంగా మారుతుందట. మొటిమలు కూడా తొలగిపోతాయట.
ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
శరీర వ్యర్థాలను తొలగించే శుద్దీకరణ : రాత్రంతా మనం నిద్రపోతున్నప్పుడు, మన శరీరంలో వివిధ రకాల జీవక్రియలు జరుగుతాయి. దీని ఫలితంగా కొన్ని విష పదార్థాలు శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంది. ఉదయం నిద్రలేవగానే, పళ్లు తోముకోకముందే ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల ఈ విషతుల్యాలు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. ఇది ఒక సహజ శుద్దీకరణ పద్ధతిగా పనిచేసి, శరీర అంతర్గత అవయవాలను ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడుతుంది.
జీవక్రియ, బరువు తగ్గడం: ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల శరీర జీవక్రియ రేటు సుమారు 25 శాతం వరకు పెరుగుతుంది. దీనివల్ల మనం తినే ఆహారం త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా, శరీరంలో అనవసరమైన కొవ్వు చేరకుండా నిరోధించబడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక సరళమైన, అత్యుత్తమ మార్గం. ఇది ఆకలిని నియంత్రించి, అతిగా ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల మనం త్వరగా బరువు తగ్గవచ్చు.
చర్మ సౌందర్యం, జుట్టు ఆరోగ్యం: శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడే చర్మం పొడిబారి, కాంతివిహీనంగా కనిపిస్తుంది. ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, చర్మానికి అవసరమైన తేమ అందుతుంది. దీనివల్ల మొటిమలు తగ్గి ముఖం మెరిసిపోవడమే కాకుండా, జుట్టు కుదుళ్లకు కూడా బలం చేకూరుతుంది. విష పదార్థాలు బయటకు వెళ్లడం వల్ల కళ్లు ప్రకాశవంతంగా మారి, రోజంతా శరీరం ఉత్సాహంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి : ప్రేగు కదలికలను క్రమబద్ధం చేసి, మలబద్ధకం సమస్యను పరిష్కరించడంలో ఉదయం త్రాగే నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది లింఫాటిక్ వ్యవస్థను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడి, శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనివల్ల తరచుగా వచ్చే జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా, ఇది మెదడు పనితీరును ప్రేరేపించి, రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది.
Note: పైన పేర్కొన్నే అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
