AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు ఐపీఎల్ హిస్టరీలోనే డేంజరస్ బ్యాటర్.. నేడు గల్లీ ప్లేయర్ కంటే దారుణం.. వచ్చే సీజన్‌లో అన్ సోల్డ్ పక్కా?

Lucknow Super Giants: స్టార్ ఆటగాళ్ల వైఫల్యంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి 4 పాయింట్లతో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన 6 మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. సీనియర్ ఆటగాళ్లు మేల్కోకపోతే, లక్నో ప్రయాణం ఈ సీజన్‌లో లీగ్ దశలోనే ముగియడం ఖాయం.

నాడు ఐపీఎల్ హిస్టరీలోనే డేంజరస్ బ్యాటర్.. నేడు గల్లీ ప్లేయర్ కంటే దారుణం.. వచ్చే సీజన్‌లో అన్ సోల్డ్ పక్కా?
Lsg Nicholas PooranImage Credit source: https://x.com/LucknowIPL/media
Venkata Chari
|

Updated on: Apr 28, 2026 | 7:15 AM

Share

Nicholas Pooran Salary: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అనేక సంచలనాలకు వేదికవుతోంది. మైదానంలో పరుగుల వరద పారుతున్నా, ఒకప్పుడు బౌలర్లను వణికించిన ఒక స్టార్ ఆటగాడు మాత్రం ఇప్పుడు దారుణంగా విఫలమవుతున్నాడు. భారీ ధర పలికిన ఈ ఆటగాడి పేలవ ప్రదర్శన చూస్తుంటే, వచ్చే ఏడాది వేలంలో అతడిని కొనేవారే ఉండరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వెస్టిండీస్ విధ్వంసకర వీరుడికి ఏమైంది?

మనం మాట్లాడుకుంటున్నది వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ గురించి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా పరుగులు సాధించే ఆటగాళ్లలో పూరన్ ఒకడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అతడిపై ఉంచిన నమ్మకం, వెచ్చించిన కోట్లు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఈ సీజన్‌లో అతడి బ్యాట్ పూర్తిగా మూగబోయింది. మైదానంలోకి రావడం, తక్కువ పరుగులకే వెనుదిరగడం అతడికి పరిపాటిగా మారింది. 2026 సీజన్ ఆరంభానికి ముందే లక్నో జట్టు అతడిని భారీ ధరకు అట్టిపెట్టుకుంది, కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో పూరన్ విఫలమయ్యాడు.

భారీ జీతం.. చెత్త ప్రదర్శన..

నికోలస్ పూరన్ ప్రతిభను గుర్తించి లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం అతడికి ఏకంగా 21 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని అందించింది. గత సీజన్లలో మెరుపులు మెరిపించిన పూరన్, ఈసారి మాత్రం లక్నో పాలిట శాపంగా మారాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన పూరన్, కేవలం 82 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో దారుణమైన విషయం ఏమిటంటే, అతడి సగటు కేవలం 10.25 మాత్రమే ఉండగా, స్ట్రైక్ రేట్ 81.19 కి పడిపోయింది. భారీ హిట్టర్‌గా పేరున్న ఆటగాడు కనీసం బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గత సీజన్ వైభవం మాయం..

2025 సీజన్‌లో పూరన్ ఆడిన తీరు అద్భుతం. అప్పట్లో 14 మ్యాచ్‌ల్లో 43.67 సగటుతో 524 పరుగులు చేశాడు. దాదాపు 196 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ సీజన్‌లో 5 అర్ధ సెంచరీలు చేయడమే కాకుండా, 45 ఫోర్లు, 40 సిక్సర్లు బాదాడు. ఆ ప్రదర్శన చూసే యజమాని సంజీవ్ గోయెంకా అతడి జీతాన్ని 16 కోట్ల నుంచి 21 కోట్లకు పెంచారు. కానీ ఇప్పుడు పెరిగిన జీతానికి తగ్గట్టుగా ప్రదర్శన పాతాళానికి పడిపోయింది.

వచ్చే సీజన్‌లో అన్-సోల్డ్ ముప్పు?

ప్రస్తుతం 31 ఏళ్ల వయసులో ఉన్న పూరన్, తన కెరీర్‌లోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. లక్నో జట్టు అతడిని వచ్చే సీజన్ కంటే ముందే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ పూరన్ వేలంలోకి వస్తే, ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ ఫ్రాంచైజీ కూడా అంత భారీ మొత్తాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. ఒకవేళ పూరన్ అమ్ముడుపోకుండా మిగిలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ హిస్టరీలోనే డేంజరస్ బ్యాటర్.. నేడు గల్లీ ప్లేయర్ కంటే..
ఐపీఎల్ హిస్టరీలోనే డేంజరస్ బ్యాటర్.. నేడు గల్లీ ప్లేయర్ కంటే..
క్రేన్‌ కింద నలిగిన కార్మకులు.. ఐదుగురు మృతి.. 11 మందికి సీరియస్!
క్రేన్‌ కింద నలిగిన కార్మకులు.. ఐదుగురు మృతి.. 11 మందికి సీరియస్!
JBL అదిరిపోయే సౌండ్‌బార్స్..డాల్బీ అట్మోస్‌తో ఇక మీ ఇల్లే థియేటర్
JBL అదిరిపోయే సౌండ్‌బార్స్..డాల్బీ అట్మోస్‌తో ఇక మీ ఇల్లే థియేటర్
మనుషులకు భయపడదు.. రాత్రుళ్లు మాత్రమే వేటాడుతుంది..
మనుషులకు భయపడదు.. రాత్రుళ్లు మాత్రమే వేటాడుతుంది..
ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ జంప్.. టాప్ 5 బ్యాటర్ల జాబితా ఇదే
ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ జంప్.. టాప్ 5 బ్యాటర్ల జాబితా ఇదే
పోలీసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఇకపై ఆ రోజుల్లో ప్రత్యేక సెలవులు
పోలీసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఇకపై ఆ రోజుల్లో ప్రత్యేక సెలవులు
ళ్లు తోమకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుంది.. తెలిస్తే
ళ్లు తోమకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుంది.. తెలిస్తే
ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్‌.. 1వ తేదీన జీతాలు రావు!
ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్‌.. 1వ తేదీన జీతాలు రావు!
సుర్రుమంటున్న సూరీడు.. ఇవాళ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు
సుర్రుమంటున్న సూరీడు.. ఇవాళ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు
ఇదే మంచి ఛాన్స్.. మహిళలకు గుడ్‌న్యూస్‌..తులం బంగారం ధర ఎంతంటే..!
ఇదే మంచి ఛాన్స్.. మహిళలకు గుడ్‌న్యూస్‌..తులం బంగారం ధర ఎంతంటే..!