AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG EAPCET 2026 Hall Tickets: టీజీ ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్‌

ఇంజినీరింగ్‌, అగ్రిక్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TG EAPCET)కు సంబంధించిన అగ్రికల్చర్‌, ఫార్మా స్ట్రీమ్‌ హాల్‌ టికెట్లు ఇప్పటికే ఉన్నల విద్యా మండలి విడుదల చేసింది. ఇక ఇంజినీరింగ్ విభాగం (Engineering) హాల్‌టికెట్లు కూడా తాజాగా విడుదలయ్యాయి. మే 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి తాజాగా..

TG EAPCET 2026 Hall Tickets: టీజీ ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్‌
TG EAPCET Hall Tickets
Srilakshmi C
|

Updated on: Apr 28, 2026 | 7:19 AM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28: తెలంగాణ ఇంజినీరింగ్‌, అగ్రిక్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TG EAPCET)కు సంబంధించిన అగ్రికల్చర్‌, ఫార్మా స్ట్రీమ్‌ హాల్‌ టికెట్లు ఇప్పటికే ఉన్నల విద్యా మండలి విడుదల చేసింది. ఇక ఇంజినీరింగ్ విభాగం (Engineering) హాల్‌టికెట్లు కూడా తాజాగా విడుదలయ్యాయి. మే 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. గత వారం అగ్రికల్చర్, ఫార్మా విభాగాల హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పుడు ఇంజినీరింగ్ విభాగం అడ్మిట్ కార్డులను కూడా విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, క్వాలిఫైయింగ్‌ ఎగ్జామినేషన్‌ హాల్‌టికెట్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 ఇంజినీరింగ్‌, అగ్రిక్చర్‌ అండ్‌ ఫార్మసీ హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా తెలంగాణ ఈఏపీసెట్‌ పరీక్షలు మే 4 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి. అధిక మంది విద్యార్ధులు రాసే ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు మొదటి సెషన్‌ పరీక్ష ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది.ఇక అగ్రికల్చర్‌, ఫార్మా విభాగం పరీక్షకు 106 పరీక్ష కేంద్రాలు, ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 ఇంజినీరింగ్‌, అగ్రిక్చర్‌ అండ్‌ ఫార్మసీ హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ప్రస్తుతం ఈఏపీసెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లకు కలిపి మొత్తం 3,01,194 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగానికి 2,10,308 మంది, అగ్రికల్చర్‌ విభాగానికి 90,569 మంది దరఖాస్తు చేశారు. రెండు విభాగాలకు సంబంధించి 317 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.10,000 ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 ఇంజినీరింగ్‌, అగ్రిక్చర్‌ అండ్‌ ఫార్మసీ హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రెండో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం!
రెండో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం!
శుభ ఘడియలు వచ్చేశాయి.. ఈ రాశుల వారికి ఆరు నెలల పాటు లక్కే లక్కు!
శుభ ఘడియలు వచ్చేశాయి.. ఈ రాశుల వారికి ఆరు నెలల పాటు లక్కే లక్కు!
రుచిగా ఉన్నాయని వీటిని అదేపనిగా తింటే.. ఆస్తమా, క్యాన్సర్ ఇంకా..
రుచిగా ఉన్నాయని వీటిని అదేపనిగా తింటే.. ఆస్తమా, క్యాన్సర్ ఇంకా..
అతి తక్కువ ధరతోనే రూ.365 రోజుల వ్యాలిడిటీ.. మతిపోగొట్టే ప్లాన్
అతి తక్కువ ధరతోనే రూ.365 రోజుల వ్యాలిడిటీ.. మతిపోగొట్టే ప్లాన్
బావి కాదు.. డీజిల్ గని! నిప్పు పెడితే భగ్గుమంటున్న జలం!
బావి కాదు.. డీజిల్ గని! నిప్పు పెడితే భగ్గుమంటున్న జలం!
తమ్ముడు సినిమాలో ఈ గ్లామరస్ బ్యూటీ గుర్తుందా ?
తమ్ముడు సినిమాలో ఈ గ్లామరస్ బ్యూటీ గుర్తుందా ?
తరచుగా మూత్రవిసర్జన డయాబెటీస్ లక్షణం అనుకుంటే తప్పులో కాలేసినట్లే
తరచుగా మూత్రవిసర్జన డయాబెటీస్ లక్షణం అనుకుంటే తప్పులో కాలేసినట్లే
సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌ అవుట్
సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌ అవుట్
ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లి..
ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లి..
నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?