Telangana: అనాధ శవాల విషయంలో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం.. ఈ నిబంధనలు తప్పనిసరి చేస్తూ..

అనాధ శవాల విషయంలో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రమాదాలు, సహజ మరణాల ద్వారా చనిపోయిన వారి శవాల విషయంలో డీజీపీ సర్కూలర్‌ జారీ చేశారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు పెరిగన నేపథ్యంలో సహజంగానే అటామనీ, రీసెర్చ్‌ కోసం శవాల అవసరాలు సైతం పెరిగాయి...

Telangana: అనాధ శవాల విషయంలో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం.. ఈ నిబంధనలు తప్పనిసరి చేస్తూ..
Unclaimed Dead Bodies
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 17, 2022 | 7:43 PM

అనాధ శవాల విషయంలో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రమాదాలు, సహజ మరణాల ద్వారా చనిపోయిన వారి శవాల విషయంలో డీజీపీ సర్కూలర్‌ జారీ చేశారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు పెరిగన నేపథ్యంలో సహజంగానే అటామనీ, రీసెర్చ్‌ కోసం శవాల అవసరాలు సైతం పెరిగాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు తాజా సర్కూలర్‌ను జారీ చేశారు.

మెడికల్‌ కాలేజీల్లో శవాల అవసరాలు ఉన్న నేపథ్యంలో ఎస్పీలు, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, జోనల్‌ డిప్యూటీ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై రాష్ట్రంలో లభించే అనాధ శవాలను మెడికల్‌ కాలేజీలకు అందించాలని తెలిపారు. పీరియాడిక్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ చేయకముందే డెడ్‌ బాడీలను అందించాలని తెలిపారు. మరణాల విషయంలో ఎలాంటి అనుమాలు లేవని, సహజ మరణమని లీగల్‌గా దృవీకరించిన తర్వాతే శవాలను మెడికల్ కాలేజీలకు ఇవ్వాలని తెలిపారు.

Telangana

ఇవి కూడా చదవండి

డీజీపీ జారీ చేసిన ఈ ఆదేశాలను పోలీసులు తప్పకుండా పాటించాలని సూచించారు. ఫోరెన్సిక్‌, లీగల్‌ ఓపినియన్‌ తీసుకున్న తర్వాత శవాలను మెడికల్ కాలేజీలకు అప్పగించాలని తెలిపారు. ఈ సర్య్కూలర్‌ కాపీని హెల్త్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌, ప్రభుత్వ సెక్రేటరీ, రైల్వే అధికారులకు పంపించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..