Hyderabad Real Estate: రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకు ఇది సరైన సమయమేనా.? వచ్చే ఏడాది పరిస్థితులు ఎలా ఉండనున్నాయి..

కరోనా తదనంతర పరిణామాల నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాస్త ఒడిదొడుకులకు గురైన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ పరిస్థితులు మెరుగవుతున్నాయి. పరిస్థితుల్లో వస్తోన్న మార్పులు కారణంగా మళ్లీ రియల్‌ ఎస్టేట్‌కు పూర్వ వైభవం వస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతోన్న డిమాండ్‌...

Hyderabad Real Estate: రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకు ఇది సరైన సమయమేనా.? వచ్చే ఏడాది పరిస్థితులు ఎలా ఉండనున్నాయి..
Hyderabad Real Estate
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 17, 2022 | 7:12 PM

కరోనా తదనంతర పరిణామాల నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాస్త ఒడిదొడుకులకు గురైన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ పరిస్థితులు మెరుగవుతున్నాయి. పరిస్థితుల్లో వస్తోన్న మార్పులు కారణంగా మళ్లీ రియల్‌ ఎస్టేట్‌కు పూర్వ వైభవం వస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతోన్న డిమాండ్‌ కారణంగా భారతీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో క్రయవిక్రయాలు పెరుగుతున్నాయి. ఎన్నారైలు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుండడం కూడా ఈ రంగానికి ఊపుతెచ్చిందని చెప్పాలి. ఇలాంటి కారణాలతో రియల్‌ ఎస్టేట్‌కు రానున్న రోజుల్లో ఢోకా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల వెలువడిన కొన్ని సర్వేల ఆధారంగా హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎన్నారైలు దేశంలో తమ పెట్టుబడికి మొదటి ఆప్షన్‌గా హైదరాబాద్‌ను ఎంచుకోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు, ప్లాట్లకు డిమాండ్‌ పెరగడం ఆశావాహంగా కనిపిస్తోంది. దేశంలో వాణిజ్య కార్యకలాపాలు మెరుగవడంతో ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇక గత మూడు త్రైమాసికాల్లో ఐటీ, రిటైల్‌ సంస్థల్లో ఆఫీజ్‌ లీజింగ్ పెరిగింది. రియల్ ఎస్టేట్‌ ఏజెన్సీ ప్రకారం 2022 క్యూ2లో దేశంలోని మెట్రో నగరాల్లో ఆఫీస్‌ లీజింగ్ 61 శాతం పెరిగింది.

దేశంలోని టైర్‌2, టైర్‌ 3 పట్టణాలు రిటైల్ రంగానికి హాట్‌స్పాట్‌గా మారాయి. ఒక నివేదిక ప్రకారం 2022లో ఢిల్లీ, పుణే, బెంగళూరు, హైదరాబాద్‌లో మొత్తం 70 శాతానికి పైగా రిటైల్‌ లీజింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఆస్తి విలువలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాల పెట్టుబడికి మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం చుట్టూ సానుకూల సెంటిమెంట్స్‌ ఉన్న దృష్ట్యా ఈ రంగం పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని నిపుణుల అంచనా. వచ్చే ఏడాది వృద్ధి రేటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఢోకా లేదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే చాలామందికి కొనుగోలు సామర్థ్యం ఉన్నా సొంతిల్లు, స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి సరైన సమాచారం లభించదు. ఏ ప్రాంతంలో గృహల ధరలు ఎలా ఉన్నాయి.. భవిష్యత్తులో ఏ ప్రాంతంలో స్థిరాస్తులకు డిమాండ్ పెరుగుతుందనే విషయాలు తెలియక రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి జంకుతారు. అలాంటివారికి ఓ మంచి అవకాశం కల్పిస్తోంది టీవీ9. హైదరాబాద్‌లో ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రియల్‌ ఎస్టేట్ ఎక్స్‌పో జరగనుంది. ఈనెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహించే TV9 స్వీట్ హోమ్ అండ్ ఇంటీరియర్ ఎక్స్‌పోను సందర్శించండి. అత్యంత విశ్వసనీయమైన దిగ్గజ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..