Telangana DGP: ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్రైమ్ రేట్ పెరుగుదలపై వివరణ ఇచ్చిన డీజీపీ

|

Aug 30, 2022 | 6:43 PM

Telangana DGP: తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగింది అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

Telangana DGP: ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్రైమ్ రేట్ పెరుగుదలపై వివరణ ఇచ్చిన డీజీపీ
Dgp Mahender Reddy
Follow us on

Telangana DGP: తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగింది అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎన్‌సీఆర్బీ నివేదిక విడుదల నేపథ్యంలో మంగళవారం నాడు డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సైబర్ క్రైమ్, యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ కేసులు ఎక్కువగా నమోదు చేస్తున్నామని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ప్రజల అవహగాన కోసం మాత్రమే కేసులు నమోదు చేసి అలెర్ట్ చేస్తున్నామని వివరించారు డీజీపీ మహేందర్ రెడ్డి.

ఇదిలాఉంటే.. ఎన్‌సీఆర్బీ విడుదల నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్‌ రేట్‌ దడ పుట్టిస్తోంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. తెలంగాణలో మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక నేరాలు పెరిగాయి. మానవ అక్రమ రవాణాలో తెలంగాణ మళ్లీ మొదటి స్థానంలో ఉంది. ఇక రైతుల ఆత్మహత్యల్లోనూ 4 స్థానంలో ఉంది తెలంగాణ. సైబర్‌ నేరాల్లోనూ తెలంగాణ తొలిస్థానంలో ఉంది. ఏకంగా 200 శాతం సైబర్‌ నేరాలు పెరిగాయి. ఆర్థిక నేరాల్లో రెండో స్థానంలో నిలిచింది. కోర్టుల్లో వీగిపోతున్న మహిళలపై నేరాల కేసుల్లో తొలిస్థానంలో ఉంది. వృద్ధులపై దాడుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..