Bhainsa ASP Kiran : తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. బైంసా ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి కిరణ్ నియామకం..

Bhainsa ASP Kiran : గత కొన్ని రోజులుగా బైంసా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం

Bhainsa ASP Kiran : తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. బైంసా  ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి కిరణ్ నియామకం..
Bhainsa Asp Kiran

Updated on: Mar 16, 2021 | 8:37 PM

Bhainsa ASP Kiran : గత కొన్ని రోజులుగా బైంసా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. డీజీపీ మహేందర్ రెడ్డి భైంసా కు ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి కిరణ్‌ను నియమించారు. బైంసాలో పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే స్పెషల్ పార్టీ బలగాలతో పాటు వందలాది మంది పోలీసులతో భైంసాలో పలుచోట్ల పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశారు. మళ్లీ ఘర్షణలు కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బైంసాలో 144 సెక్షన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

నిర్మల్ జిల్లా బైంసాలో కొన్ని రోజుల క్రితం జుల్ఫీకర్ గల్లీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంఘటనే ఈ అల్లర్లకు కారణం. ఈ ఘర్షణల్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు ఇద్దరు రిపోర్టర్లు, ఇద్దరు పోలీసులు, ఏడుగురు స్థానికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఈ అల్లర్లకు కారణంగా తెలుస్తోంది. జుల్ఫేర్ గల్లీలో మొదలైన ఈ ఘర్షణ ఆ తరువాత కుబీర్ రోడ్డు, గణేష్ నగర్, మేదర్ గల్లీ బస్టాండ్ ప్రాంతాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందువల్ల ఎటువంటి గొడవలు కాకుండా ఉండేందుకు ఆలయాలు, ప్రార్థాన మందిరాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

India vs England 3rd T20 Live: గేర్ మార్చిన విరాట్ కోహ్లీ.. భారీ సిక్సర్లు.. తోడుగా హార్దిక్ పాండ్యా..

Mahesh Babu : మహేష్ తో భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ బడా నిర్మాత.. హీరోయిన్ ఎవరంటే..

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు..!

డీహెచ్‌ఎల్‌తో సంప్రదింపులు జరుపుతున్న ఇండియన్ పోస్ట్.. మరిన్ని దేశాలకు స్పీడ్ పోస్ట్ సేవలను పెంచే దిశగా..