Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ లొల్లి.. అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో చిచ్చు. కమిటీలు కల్లోలం రేపుతున్నాయి! తొలిసారి CLP లీడర్ భట్టివిక్రమార్క కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు..!ఎలాంటి కసరత్తు లేకుండా.. కనీసం తనను సంప్రదించకుండా కమిటీలు అనౌన్స్ చేశారని కుండబద్దలు కొట్టారు భట్టి. మరీ ఎపిసోడ్‌ ఎలాంటి టర్న్ తీసుకుటుంది? నెక్ట్స్ ఏం జరుగుతుంది?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ లొల్లి.. అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్లు..
Telangana Congress
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 12, 2022 | 8:49 PM

తెలంగాణ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి.. పార్టీ శ్రేణులు, నేతల్లో కొత్త జోష్‌ను నింపేందుకు.. జంబో కమిటీలను ప్రకటించింది హైకమాండ్. ఇవి పార్టీకి ఏమేరకు ఉపయోగపడుతాయి అన్నది పక్కన పెడితే డ్యామేజ్‌ మాత్రం గట్టిగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది..! రెండు రోజులుగా సీనియర్లంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీఎల్పీ లీడర్‌ భట్టి నివాసంలో సమావేశమై తమకు జరిగిన అన్యాయంపై చర్చించారు..! అన్ని అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు..! ఈ మీటింగ్ తర్వాత భట్టి చేసిన కామెంట్స్ హాట్‌టాఫిక్‌గా మారాయి. పార్టీకి పీసీసీ చీఫ్, సీఎల్పీ నాయకుడు ఇద్దరూ ఇంపార్టెంట్. కానీ కమిటీల ఎంపిక విషయంలో మాత్రం తనను ఇన్వాల్స్‌ చేయలేదని స్పష్టం చేశారు..! ఇలా ఎందుకు జరిగిందన్నది మాణిక్యం ఠాకూర్‌నే అడగాలన్నారు.

పీసీసీ కమిటీల్లో చోటు దక్కని వారంతా ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా చేశారు. బెల్లయ్యనాయక్‌ కూడా అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పుకున్నారు. మరికొందరు సీనియర్లు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న వారిని కాదని.. కొత్త వారికి పదవులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కొక్కరిని రెండు, మూడు కమిటీల్లో వేయడంపైనా ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బయటికి చెప్పకపోయినా.. మరోసారి అందరూ పరోక్షంగా రేవంత్‌రెడ్డి తీరుని తప్పుపడుతున్నారు. వీరవిధేయులు, పాత వారిని కాదని కొత్తగా వచ్చిన వాళ్లకు కమిటీల్లో చోటు కల్పించడం ఏంటని నిలదీస్తున్నారు. మొత్తానికి ఈ కమిటీల చిచ్చు ఇప్పట్లో చల్లారే ప్రయత్నం అయితే కనిపించడం లేదు. మరీ అసంతృప్తులను బుజ్జగించేందుకు హైకమాండ్ ఎలాంటి ప్రయత్నం చేస్తుందన్నది ఆసక్తికరం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం