Congress: గవర్నర్ తమిళసై తో ముగిసిన టి- కాంగ్రేస్ బృందం భేటీ.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు..

Congress: రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌తో టి.కాంగ్రెస్ నేతల బృందం భేటీ ముగిసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని,

Congress: గవర్నర్ తమిళసై తో ముగిసిన టి- కాంగ్రేస్ బృందం భేటీ.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు..

Updated on: Jan 25, 2022 | 5:45 PM

Congress: రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌తో టి.కాంగ్రెస్ నేతల బృందం భేటీ ముగిసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, ఇదే అంశాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిందని విమర్శించారు. పోలీసుల విధులకు టీఆర్ఎస్ నేతలు ఆటంకం కలిగిస్తు్నారని ఆరోపించారు. వనమా రాఘవా దాష్టికాలు, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, మంథనిలో అద్వకేట్ హత్య, శీలం రంగయ్య ఘటనల గురించి గవర్నర్‌కు వివరించామని భట్టి తెలిపారు. రాష్ట్రం శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పోలీస్ శాఖపై గవర్నర్ సమీక్ష చేయాలని కోరామన్నారు. టీఆర్ఎ‌స్ ప్రభుత్వంలో పోలీస్ – పోలీస్ లాగా పనిచేయడం లేదన్నారు. పోలీస్ నుంచి రక్షణ ఉంటది అనే భావన ప్రజలు కోల్పోయారన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు చెప్తేనే పోలీస్ దగ్గర న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం పోలీసులు తమ విధులు తాము నిర్వహించాలని, ఒత్తిళ్లకు లొంగోద్దన్నారు.

Also read:

Vastu Tips for Plants: ఇంట్లో ఈ 10 మొక్కలు నాటండి.. లక్ష్మి దేవి అనుగ్రహం పొందండి..

Zero covid countries: షాకింగ్! ఈ ఏడు దేశాల్లో ఇప్పటి వరకు ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదవ్వలేదు.. ఎందుకో తెలుసా..

Viral Video: కుమ్మేందుకు దూసుకొచ్చి గొర్రె.. ఆ వ్యక్తి తప్పించుకున్న విధానం చూస్తే వావ్ అనాల్సిందే..