Revanth Reddy : రేపే పీసీసీ చీఫ్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి.. భారీ సభకు ప్లాన్.. లక్ష మంది వస్తారని అంచనా..

|

Jul 06, 2021 | 1:24 PM

Telangana Congress : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకం అయిన రేవంత్ రెడ్డి.. బుధవారం నాడు బాధ్యతలు చేపట్టనున్నారు.

Revanth Reddy : రేపే పీసీసీ చీఫ్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి.. భారీ సభకు ప్లాన్.. లక్ష మంది వస్తారని అంచనా..
Revanth Reddy
Follow us on

Revanth Reddy : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకం అయిన రేవంత్ రెడ్డి.. బుధవారం నాడు బాధ్యతలు చేపట్టనున్నారు. రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో గాంధీ భవన్ ఆవరణలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు శరవేగంగా గాంధీ భవన్ సుందరీకరణ పనులు చేస్తుండగా.. మరోవైపు రేవంత్ బాధ్యతల స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి లక్షకు పైగా జనాలు వస్తారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. ఇక రేవంత్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా హైదరాబాద్ రోడ్లకు ఇరువైపులా భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

ఇదిలాఉంటే.. రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి నాంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత గాంధీ భవన్‌కు వెళతారు. గాంధీ భవన్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి చార్జీ తీసుకున్న తరువాత ఇందిరా భవన్ ముందు సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దక్షిణాది రాష్ట్రాల పీసీసీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, మాణిక్యం ఠాగూర్‌లు హాజరుకానున్నారు. ఇక ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే దాదాపు పార్టీలోని అందరు సీనియర్ నేతలను రేవంత్ రెడ్డి కలిశారు.

జీహెచ్ఎంసీ‌లో ఓటమి తరువాత కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ పదవికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉత్తమ్ కుమారే తాత్కాలిక పీసీసీ చీఫ్‌గా కొనసాగుతూ వస్తున్నారు. అదే సమయంలో నూతన పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ హైకమాండ్ వేగిరం చేసింది. వాస్తవానికి పీసీసీ చీఫ్‌ ఎంపికను నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలోనే చేయాల్సి ఉండగా.. నాడు పార్టీ సీనియర్ నేతల ఒత్తిడితో ఆ ప్రకటన నిలిచిపోయింది. పీసీసీ చీఫ్ ప్రకటనలో ఆలస్యం కారణంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుండటంతో.. వెంటనే రంగంలోకి దిగిన పార్టీ హైకమాండ్ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియలో స్పీడ్ పెంచింది. ఈ పోస్ట్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించగా.. చివరికి రేవంత్ రెడ్డి పేరును ఫైనల్ చేశారు. ఆయన పేరు ప్రకటించడమే ఆలస్యం.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

Also read:

Fish Pond: చేపలందు ఈ చెరువులోని చేపలే వేరు.. తండోపతండాలుగా తరలివస్తున్న జనాలు.. అసలు విషయం ఏంటంటే..

Dalai Lama’s Birthday: టిబెటన్ అధ్యాత్మిక గురువు దలైలామా గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం..

Sand Mafia: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బరితెస్తున్న సాండ్ మాఫియా.. పట్టించుకోని అధికారులు..