Telangana Congress: ఎంత పెద్ద లీడరైనా అప్లయ్ చేసుకోవాల్సిందే.. కాంగ్రెస్ టికెట్ల కోసం క్యూ కడుతోన్న లీడర్లు..
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల రేస్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దాంతో, గాంధీభవన్ కోలాహలంగా మారింది. ఎమ్మెల్యే టికెట్ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు లీడర్లు. తమ బలాబలాలను ప్రస్తావిస్తూ దరఖాస్తు చేసుకుంటున్నారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల రేస్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దాంతో, గాంధీభవన్ కోలాహలంగా మారింది. ఎమ్మెల్యే టికెట్ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు లీడర్లు. తమ బలాబలాలను ప్రస్తావిస్తూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎప్పట్నుంచి పార్టీలో ఉన్నారో?. ఎంత లాయల్టీగా ఉన్నారో? పార్టీ కోసం ఏమేం చేశారో? నియోజకవర్గంలో ఎంత పట్టుందో? సామాజికంగా ఉన్న ప్లస్‌లు!, ఇలా దేన్నీ వదలకుండా సకల అస్త్రాలను అప్లికేషన్‌లో పొందుపరుస్తూ దరఖాస్తు చేసుకుంటున్నారు నేతలు.
ఆగస్ట్ 25వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు!. ఆ తర్వాత అప్లికేషన్లను వడబోసి, స్క్రీనింగ్ కమిటీకి పంపుతుంది ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ .. అభ్యర్ధుల్ని ఫైనల్ చేస్తుంది. ఒకవేళ అక్కడ కూడా అభ్యర్ధి ఎంపిక తేలకపోతే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుంది.
ఎంత పెద్ద లీడరైనా అప్లయ్ చేసుకోవాల్సిందే..
ఎంత పెద్ద లీడర్ అయినాసరే కాంగ్రెస్ తరపున పోటీ చేయాలనుకుంటే మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సిందే అంటున్నారు రేవంత్. చివరికి, పీసీసీ అధ్యక్షుడైనా, సీఎల్పీ నేత అయినాసరే దరఖాస్తు చేసుకోవాల్సిందే!. మేం సీనియర్లం, అనుభవం ఉందని ఎవరికి వాళ్లు టికెట్లను ప్రకటించుకుంటే కుదరదని తేల్చిచెప్పేశారు రేవంత్‌రెడ్డి. ఇంతవరకు బానే ఉంది. కానీ.. అభ్యర్థులకు నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తి సెగల మాటేంటి.. ఇల్లు చక్కదిద్దుకోలేని వాడు..దేశాన్నేం ఉద్దరించదగలడు.




తెలంగాణలో జోష్
అయితే, కర్నాటకలో గెలిచామని కాలర్ ఎగరేశారు. ఇక తెలంగాణలోనూ సత్తా చాటుతామని.. ధీమా వ్యక్తం చేశారు. తీరా చూస్తే వ్యవహారం వేరేలా కనిపిస్తోంది. గాంధీభవన్‌లో ఎంత జోష్ కనిపిస్తోందో.. అదే స్థాయిలో నిరసన గళం వినిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. ఇది, హస్తం పార్టీని గందరగోళంలోకి నెడుతోంది. అవును, మేమింతే అదో టైపు అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. పొంగులేటి ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్ కావడం.. ఇదంతా చూశాక ఇక పార్టీ గాడిన పడ్డట్టే అనుకున్నారంతా.. కానీ పొంగులేటి చేరికపై స్థానిక నాయకుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో అసమ్మతి గళం..
ఎంత జోష్ వచ్చినా.. ఏం లాభం? ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. అదే స్థాయిలో అసమ్మతి గళానికీ వేదికవుతోంది గాంధీ భవన్. మునుగోడు కాంగ్రెస్ నేతలు.. ఏకంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఎదుటే ఆందోళనకు దిగారు. మునుగోడు మండల కమిటీలన్నీ..చలిమల కృష్ణారెడ్డి వర్గానికే ఇచ్చారంటూ.. పాల్వాయి స్రవంతి వర్గం గాంధీభవన్‌లో బైఠాయించింది. పాల్వాయి స్రవంతి, కైలాష్ నేతలకి తెలియకుండా నిర్ణయం తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గాంధీభవన్‌లో గందరగోళం ఏర్పడింది.
తెలంగాణ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితులు.. ఎప్పుడు భగ్గుమంటాయోనన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..