
Telangana companies: తెలంగాణ సంస్థలు దూసుకుపోతున్నాయి. వ్యాపార, పారిశ్రామిక రంగాలలో తెలంగాణ సత్తా చాటుతోంది. ఈ సంస్థలు దేశ విదేశాల్లో సైతం విస్తరించాయి. 2021 బుర్గుండి ప్రైవేట్-హురున్ ఇండియా 500 జాబితాలో రాష్ట్రానికి చెందిన 29 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల విలువ రూ.6.9 లక్షల కోట్లు. అయితే రూ.1,36,699 కోట్లతో అగ్రస్థానంలో ఉన్న దివీస్ ల్యాబ్.. రూ.1,31,598 కోట్లతో హిందుస్థాన్ జింక్ రెండో స్థానంలో ఉంది. ఇక రూ. 77,540 కోట్లతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ మూడో స్థానంలో ఉంది. అలాగే స్టాక్ మార్కెట్ నమోదిత సంస్థలను మార్కెట్ విలువతో లెక్కించి ర్యాంకులు ఇచ్చింది హురున్ ఇండియా. స్టాక్ మార్కెట్లో నమోదుకాని వాటిని వాల్యుయేషన్స్ ఆధారంగా ర్యాంకులిచ్చినట్లు వెల్లడించింది. 2021, అక్టోబర్ 30 నాటికి ఉన్న మార్కెట్ విలువ, ఆస్తులు, అమ్మకాలు, ఆదాయం, లాభాల ఆధారంగా ఈ జాబితా రూపొందించినట్లు వెల్లడించింది.
పరిశ్రమల వారీగా చూస్తే..
అతిపెద్ద వాటా ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమతో కలిపి ఆరోగ్య సంరక్షణ రంగానిదే. ఈ రంగంలో 15 సంస్థలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో సాఫ్ట్ వేర్, సేవలు, కెమికల్స్, మౌలిక సదుపాయాల పరిశ్రమలు ఉన్నాయి.
అత్యధిక విలువ కలిగిన జాబితాలో.. టాప్ 5 సంస్థలు
► మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్
► హెటిరో ల్యాబ్స్
► ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్
► భారత్ బయోటెక్
► డెక్కన్ ఫైన్ కెమికల్స్
అత్యంత వృద్ధి సాధించిన జాబితాలో.. టాప్ 3
► బ్రైట్ కామ్ గ్రూప్
► తాన్లా ప్లాట్ ఫామ్స్,
► సువెన్ ఫార్మాస్యూటికల్స్
పూర్తి విలువ, లాభాల పరంగా.. టాప్ 3 సంస్థలు
► దివిస్ ల్యాబోరేటరీస్,
► హిందుస్థాన్ జింక్
► లారస్ ల్యాబ్స్
టాప్- 10 తెలంగాణ సంస్థలు- విలువ(రూ. కోట్లలో)
► దివీస్ ల్యాబోరేటరీస్ – 1,36,699
► హిందూస్థాన్ జింక్ – 1,31,598
► డాక్టర్ రెడ్డీస్ – 77,540
► అరబిందో – 41,402
► లారస్ ల్యాబ్స్ – 30,849
► మేఘా ఇంజినీరింగ్ – 28,900
► కోరమాండల్ – 23,556
► హెటిరో డ్రగ్స్ – 22,300
► ఎంఎస్ఎన్ – 17,095
► తాన్లా – 16,647
ఇవి కూడా చదవండి: