CM KCR will visit MGM hospital Tomorrow: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శుక్రవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించనున్నారు. అక్కడ కోవిడ్ రోగులతో మాట్లాడి వారికి భరోసాను ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా వైద్యం, తదితర వివరాలను తెలుసుకోనున్నారు. దీంతోపాటు ఆయన వైద్యులు, సిబ్బందితో ముచ్చటించనున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు..
ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ హన్మకొండకు సీఎం హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడినుంచి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీ కాంతరావు ఇంటికి వెళ్లనున్నారు. కెప్టెన్ ఇంట్లోనే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అక్కడినుంచి బయల్దేరి సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. అనంతరం ఎంజీఎం ఆసుపత్రిని సందర్శిస్తారు. ఈ సందర్భంగా కోవిడ్ రోగులను సీఎం పరామర్శించి మాట్లాడనున్నారు. ఇక్కడి నుంచి తిరిగి కెప్టెన్ ఇంటికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకొని.. అనంతరం తిరిగి హెలిపాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
Also Read: