AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cm KCR: రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్‌.. అధికారులతో కలిసి నాలుగు గంటల పాటు పరిసర ప్రాంతాల పరిశీలన

Cm KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో కేసీఆర్‌ మేడిగడ్డ బ్యారేజ్‌కు ...

Cm KCR: రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్‌.. అధికారులతో కలిసి నాలుగు గంటల పాటు పరిసర ప్రాంతాల పరిశీలన
Subhash Goud
|

Updated on: Jan 18, 2021 | 6:35 PM

Share

Cm KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో కేసీఆర్‌ మేడిగడ్డ బ్యారేజ్‌కు చేరుకోనున్నారు. అక్కడ అధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్‌ని దర్శిస్తారు.

కాగా, మేడిగడ్డ వద్ద నీటి మట్టం వంద అడుగులకు చేరింది. ఐదు నెలల విరామం తర్వాత కాళేశ్వరంలో మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభం అయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్‌ 1,2 లలో గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. కేసీఆర్‌ సందర్శన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. సుమారు నాలుగు గంటల పాటు కేసీఆర్‌ అధికారులతో కలిసి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించనున్నారు.

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ప్రధానమైనది మేడిగడ్డ బ్యారేజ్‌. కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత కలిసే ప్రాంతానికి ఎగువన మేడిగడ్డ బ్యారేజ్‌ను నిర్మాణం చేపట్టడం జరిగింది. రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని లిఫ్ట్‌ చేసే విధంగా డిజైన్‌ చేసి 1.67 కిలోమీటర్ల పొడవుతో బ్యారేజ్‌ని పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి 85 గేట్లను ఏర్పాటు చేశారు. అయితే కుడి, ఎడమ వైపున కర కట్టలు నిర్మాణం చేశారు. కుడి వైపున 6.30 కిలోమీటర్లు, ఎడమ వైపు 11.7కిలోమీటర్లు కరకట్టలను నిర్మించారు.

కాగా, రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ రీడిజైన్‌ చేయించారు. మంత్రి హరీష్‌రావు పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు వెళ్లడంతో స్వల్ప కాలంలోనే భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది.

Also Read:

విద్యుత్ సిబ్బంది కృషితోనే 24 గంట‌ల నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా… మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు…

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?