విద్యుత్ సిబ్బంది కృషితోనే 24 గంట‌ల నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా… మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు…

విద్యుత్ సిబ్బంది కృషితోనే 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయ‌గ‌లుగుతున్నామ‌ని మంత్రి క‌ల్వ‌కుంట్ల

విద్యుత్ సిబ్బంది కృషితోనే 24 గంట‌ల నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా... మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు...
Follow us

| Edited By:

Updated on: Jan 18, 2021 | 3:41 PM

Minister KTR : విద్యుత్ సిబ్బంది కృషితోనే 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయ‌గ‌లుగుతున్నామ‌ని మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు అన్నారు. విద్యుత్ ఇంజినీర్ల అసోసియేష‌న్ రూపొందించిన 2021 డైరీ, క్యాలెండ‌ర్‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా విజయవంతం చేయడం వెనుక విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది తోడ్పాటు ఉందన్నారు.

సాధక బాధకాలు తెలిసిన వారికే యాజమాన్య బాధ్యతలు అప్పగించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ రుజువు చేశారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు రాష్ట్రంలో వెలుగులు విరజిమ్ముతున్న విద్యుత్ శాఖ మరిన్ని విజయాలు సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్య‌మంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మ‌ర‌ణీయంగా నిలిచిపోతోంద‌ని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిలతో పాటు విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ స‌భ్యులు ఉన్నారు.