వీఆర్‌ఏలకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ సంబంధిత విభాగ ఉద్యోగులకు బంపారాఫర్ ఇచ్చారు. గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)లకు శుభవార్త చెప్పారు..

వీఆర్‌ఏలకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌
Follow us

|

Updated on: Sep 11, 2020 | 8:13 PM

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ సంబంధిత విభాగ ఉద్యోగులకు బంపారాఫర్ ఇచ్చారు. గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)లకు శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు పే స్కేల్‌ అమలుతో పాటు పదవీ విరమణ కోరితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా వీళ్లు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో వారు కోరుకుంటే వాళ్ల ఇంట్లో పిల్లలకు ఎవరికైనా వీఆర్‌ఏ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. గ్రామీణ ప్రాంతంలో వీఆర్‌ఏలు ఎంతో సేవ చేస్తున్నారని గుర్తుచేశారు. వీరిలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని కేసీఆర్ అన్నారు. శుక్రవారం కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా సీఎం అసెంబ్లీలో ప్రసంగించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీఆర్‌ఏ సమస్యలపై ప్రశ్న సందర్భంగా సీఎం ఈ విధమైన హామీ ఇచ్చారు. ఇలాఉండగా, శుక్రవారం నూతన రెవెన్యూ చట్టానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Latest Articles