Christmas Celebrations: హైదరాబాద్‌లో క్రిస్టమస్ జోష్.. జిగేల్‌ లైటింగ్స్, భారీ క్రిస్టమస్ ట్రీలతో కనువిందు

| Edited By: Srilakshmi C

Dec 22, 2023 | 1:32 PM

హైద్రాబాద్ లో క్రిస్టమస్ ఫెస్టివల్ హడావిడి నెలకొంది. ఎక్కడ చూసిన కలర్ ఫుల్ లైటింగ్స్, క్రిస్మస్ ట్రీస్, నోరూరించే కేక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు హోటల్స్, చర్చీలను కలర్ ఫుల్ లైటింగ్స్ తో కనువిందు చేస్తుంటాయి. ప్రస్తుతం సిటిలో కేక్ మిక్సింగ్ సెర్మనీల జోష్ తో పాటూ.. క్రిస్మస్ ట్రీస్, స్టార్స్, లైటింగ్స్ కొనుగోళ్ల జోరు పెరిగింది. షాపింగ్ మాల్స్ లో క్రిస్మస్, న్యూయర్ కోసం అప్ టూ 50శాతం డిసౌంట్స్..

Christmas Celebrations: హైదరాబాద్‌లో క్రిస్టమస్ జోష్.. జిగేల్‌ లైటింగ్స్, భారీ క్రిస్టమస్ ట్రీలతో కనువిందు
Christmas Celebrations
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 22: హైద్రాబాద్ లో క్రిస్టమస్ ఫెస్టివల్ హడావిడి నెలకొంది. ఎక్కడ చూసిన కలర్ ఫుల్ లైటింగ్స్, క్రిస్మస్ ట్రీస్, నోరూరించే కేక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు హోటల్స్, చర్చీలను కలర్ ఫుల్ లైటింగ్స్ తో కనువిందు చేస్తుంటాయి. ప్రస్తుతం సిటిలో కేక్ మిక్సింగ్ సెర్మనీల జోష్ తో పాటూ.. క్రిస్మస్ ట్రీస్, స్టార్స్, లైటింగ్స్ కొనుగోళ్ల జోరు పెరిగింది. షాపింగ్ మాల్స్ లో క్రిస్మస్, న్యూయర్ కోసం అప్ టూ 50శాతం డిసౌంట్స్ అందిస్తున్నారు. హైద్రాబాద్‌లో క్రిస్టమస్ పండుగ శోభ నెలకొంది. స్టార్ హోటల్స్, మాల్స్, చర్చీల్లో లైటింగ్స్, కలర్ ఫుల్ డెకరేషన్స్ తో ముస్తాబు చేస్తున్నారు. మొన్నటిదాకా ప్లమ్ కేక్స్ కోసం చేసే కేక్ మిక్సింగ్ సెర్మనీల జోరు కొనసాగింది. ఇక ఇప్పుడు క్రిస్టమస్ ట్రీ లైటింగ్స్, క్యారెల్స్ సందడి నెలకొంది. విదేశాల్లో పేరొందిన క్రిస్టమస్ ట్రీ ని గుర్తూ చేసేలా.. ఆర్టిఫీషియల్ క్రిస్టమస్ ట్రీలను క్రైస్తవులు తమ ఇండ్లల్లో డెకారేట్ చేసుకుంటున్నారు. ఇటు హోటల్స్, కార్పోరేట్ ఆఫీస్‌లు, షాపింగ్ మాల్స్ ముందు డిఫరెంట్ థీమ్స్ తో క్రిస్టమస్ ట్రీ లైటింగ్ ముస్తాబు చేస్తున్నాయి. సిటిలో క్రిస్టమస్ గిఫ్టింగ్స్ లో కోసం షాంటాక్లాస్ బొమ్మలు, బెల్స్, రకరకాల సర్ప్రైజ్ గిఫ్ట్స్ ను కొటున్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు మార్కెట్ లో న్యూ వెరైటీ డెకరేషన్ ఐటమ్స కనువిందు చేస్తున్నాయి. ఒక్క క్రిస్మస్ ట్రీ 1000 నుండి మొదలు కొని 10వేల పైనే ధరలు ఉన్నాయి. రకరకాల స్టార్స్, క్రిస్మస్ ట్రీ కి అలంకరించే వస్తువులు, శాంతా క్లాజ్ బొమ్మలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25న ఎంతో ఘనంగా జీసస్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటారు. హైదరాబాడ్‌ వాసులు అన్ని కల్చర్స్ ను ఫాలో అవుతుంటారు. ఇక్కడ ప్రతి ఒక్క ఫెస్టివల్ శోభ కనిపిస్తుంది. ప్రస్తుతం క్రిస్టమస్ పండుగ కోసం నగరంలోని హోటల్స్ లో ఎంట్రన్స్ లో స్నో థీమ్ సెటప్, లైటింగ్స్, భారీ క్రిస్టమస్ ట్రీలు అట్రాక్ట్ చేస్తున్నాయి. క్రిస్టియన్స్ గ్రాండ్ గా సెలెబ్రెట్ చేసుకునే పండుగ కావడంతో ఇంటిళ్లి పాది బట్టలు, అన్ని రకాల షాపింగ్స్ తో బిజిగా మారరు. ఫెస్టివల్ కోసం ఎంతైన ఖర్చు చేస్తామంటున్నారు. ప్రస్తుతం సిటీలో క్రిస్టమస్ కోసం కిడ్స్ వేర్, మెన్స్ వేర్, వుమెన్ వేర్ పైన బై వన్‌ గెట్ వన్, అప్ టూ 50శాతం వరకు ఆఫర్స్ అందిస్తున్నారు.

షోరూమ్ నిర్వాహకులు హోటల్స్ కు వచ్చే గెస్టలకు న్యూ థీమ్‌తో వెల్‌కమ్‌ చెబుతున్నారు. క్రిస్టమస్ సీజన్ లో 10 డేస్ ముందు చర్చీల్లో జీసస్ పాటలు పాడూతూ సాంథాక్లాజ్ వేశాలు వేసుకొని పిల్లలకు, పెద్దలకు బొమ్మలు, గిఫ్ట్ లు, చాక్లెట్స్ పంచిపెడుతుంటాడు. అలాగే జీసెస్ పాటలు పాడూతు నిర్వహించే క్యారెల్స్ కార్యక్రమాలకు ప్రాధన్యత ఉంటుంది. ఇవేకాక క్రిస్టమస్ పండగ సీజన్ టైమ్ లో రకరకాల ఫుడ్ ఫెస్టివల్స్, సండే బ్రంచ్ లు కండక్ట్ చేస్తుంటారు హోటల్ నిర్వహకులు. ఇండియన్, ఏషియన్, కాంటినెంటల్ ఫుడ్స్ తో బ్రంచ్ లను నిర్వహిస్తారు. రకరకాల జ్యూస్ లు, కేక్స్, పేస్ట్రీస్,స్వీట్స్, వెరైటీ ఫుడ్స్ తో సిటిలోని హోటల్స్ ఫుడ్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. రెస్టారెంట్స్, బేకరీస్ లో ప్లమ్ కేక్స్, డిఫరెంట్ ఫ్లేవర్ క్రిస్టమస్ కేకులు నోరూరిస్తున్నాయి. ఈ సీజన్ లో షాపింగ్‌లు, హోటల్స్, రెస్టారెంట్స్ లో ఇయర్ ఎండ్ బఫేట్ ఫుడ్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు సిటిజనం. కాలేజీల్లో మిని క్రిమస్ పార్టీలు గ్రాండ్ గా చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పటికే నగరంలోని పలు షాపింగ్ ఏరియాల్లో ఆర్టిఫీషియల్ క్రిస్టమస్ ట్రీల సేల్స్ జోరందుకున్నాయి. ప్రతి ఒక్క క్రిస్టియన్ ఫ్యామిలీ జీసస్ బర్త్ డే గుర్తుగా ఇంటి బయట స్టార్ ను ఏర్పాటు చేస్తుంటారు. ఇంట్లో క్రిస్టమస్ ట్రీలు, లైటింగ్ సెటప్ తో అందంగా డెకరేషన్స్ చేస్తుంటారు. క్యారెల్స్ పార్టీల్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో క్రిస్టమస్ డిన్నర్ పార్టీలను ఎంజాయ్ చేస్తున్నారు సిటీ పబ్లిక్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.