Lock Down In Telangana: తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎట్టి ప‌రిస్థితుల్లో ఉండ‌దు.. స్ప‌ష్టం చేసిన సీఎం కేసీఆర్‌..

Lock Down In Telangana: రోజురోజుకీ పెరుగుతోన్న క‌రోనా కేసుల నేపథ్యంలో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోనూ లాక్‌డౌన్ విధిస్తారా.?

Lock Down In Telangana: తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎట్టి ప‌రిస్థితుల్లో ఉండ‌దు.. స్ప‌ష్టం చేసిన సీఎం కేసీఆర్‌..
Lockdown In Telangana
Follow us

|

Updated on: May 06, 2021 | 10:20 PM

Lock Down In Telangana: రోజురోజుకీ పెరుగుతోన్న క‌రోనా కేసుల నేపథ్యంలో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోనూ లాక్‌డౌన్ విధిస్తారా.? అన్న చ‌ర్చ జ‌రిగింది. అయితే తాజాగా ఈ విష‌య‌మై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్ట‌త నిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వ‌ల్ల‌ ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న‌ తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన ముఖ్య‌మంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మోదీతో చ‌ర్చించిన కేసీఆర్‌..

రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు ఆక్సీజన్ రెమిడిసివర్ సరఫరా గురించి ప్రధాని నరేంద్రమోడితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం తక్షణమే రాష్ట్రానికి సాయం చేయాల‌ని కోరారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజ‌న్‌ అందడం లేదని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారిన నేప‌థ్యంలో సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైద్రాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, క‌ర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైద్రాబాద్ కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వ‌ల్ల‌ హైద్రాబాద్ మీద భారం పెరిగిపోయిందని సీఎం వివరించారు. తెలంగాణ జనాభాకు అధనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వ‌ల్ల‌ హైద్రాబాద్ మీద ఆక్సీజన్, వాక్సీన్ రెమిడిసివర్ వంటి మందుల లభ్యత మీద ప్ర‌భావం పడుతున్నదని ప్రధానికి సీఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్థుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. రోజుకు తెలంగాణలో కేవలం 4900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల డోసులను అందచేసిందని కానీ రాష్ట్ర అవసరాల ద్రుష్ట్యా అవసరం మరింతగా ఉంద‌ని కోరారు. రాష్ట్రానికి వాక్సీన్లు ప్రతిరోజుకు 2 నుంచి 2.5 లక్షల డోసులు అవసరం ఉంటుంద‌ని వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధాని మోడీని సీఎం కేసీఆర్‌ విజ్జప్తి చేశారు. కాగా….సిఎం కెసిఆర్ విజ్జప్తి చేయడంతో.. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సిఎం కేసీఆర్‌తో మాట్లాడారు. కేసీఆర్‌కు తెలిపిన‌ అంశాలన్నింటినీ సత్వరమే రాష్ట్రానికి సమాకూరుస్తామని, ఆక్సీజన్ వాక్సీన్ రెమిడిసివర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ హామీ ఇచ్చారు. ఆక్సీజన్‌ను క‌ర్ణాట‌క‌ తమిళనాడుల నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాల నుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు.

క‌రోనా ప‌రిస్థితుల‌పై కేసీఆర్ ఉన్న‌త స్థాయి స‌మీక్షా..

కరోనా పరిస్థితుల పై గురువారం ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్నిసీఎం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు బోయిన పల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సిఎంవో కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, హైల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు, డిఎంఈ రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గంగాధర్ తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను కూలంకషంగా సమీక్షించారు. ప్రస్తుతం ఎంత వరకు ఆక్సీజన్ అందుతున్నది ఇంకా ఎంత కావాలి? వ్యాక్సిన్లు ఎంత మేరకు అందుబాటులో ఉన్నాయి.. రోజుకు ఎంత అవసరం ? రెమిడిసివర్ మందు ఏ మేరకు స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంది రాష్ట్రావసరాలకు రోజుకు ఎన్ని అవసరం అనే విషయాలతో పాటు ఆక్సీజన్, బెడ్ల లభ్యత వంటి విషయాలమీద పూర్తిస్థాయిలో చర్చించారు.

ప్రజలకు ఇంటికే కోవిడ్ మెడికల్ కిట్లు..

కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సీఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే ….కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికే అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.

Also Read: బెంగాల్ హింస బాధితులకు రూ. 2 లక్షల పరిహారం.. కూచ్‌బెహార్‌ కాల్పుల్లో మరణించిన కుటుంబాలు ఉద్యోగంః మమతా

టీమిండియా క్రికెటర్ ఇంట్లో వరుస విషాదాలు.. కరోనాతో మొన్న అమ్మ.. నేడు అక్క.. ఎమోషనల్ ట్వీట్..

హిమాలయాల మీదుగా విమానాలు ఎందుకు ప్రయాణించవు..! తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు…!

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..