
హైదరాబాద్‌లో త్వరలో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతిఏడాది బోనాల పండగ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా ఆషాడ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం వారం రోజుల్లోగా ఆలయ కమిటీలు దరఖాస్తులు చేయాలని ఆయన సూచించారు. బోనాల ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ పరిధిలో లేని దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సాయ అందిస్తుందని పేర్కొన్నారు. బోనాల నిర్వహణ కోసం ప్రతి ఏటా దేవాదాయ శాఖ పరిధిలోని లేని దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.అయితే బోనాల పండుగకు ముందే ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభత్వం నిర్ణయించిందని తెలిపారు.
రాష్ట్రంలో జూన్ 22న గోల్కొండలో బోనాలు ప్రారంభం కానున్నాయని, జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని మంత్రి తలసాని వివరించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆషాఢ బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం