ఇవాళ మంత్రివర్గ సమావేశం.. తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠ.. కీలక నిర్ణయాలు ప్రకటించనున్న సీఎం కేసీఆర్

Telangana cabinet: మంగళవారం జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆసక్తికరంగా మారింది. ఎన్నో కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా..

ఇవాళ మంత్రివర్గ సమావేశం.. తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠ.. కీలక నిర్ణయాలు ప్రకటించనున్న సీఎం కేసీఆర్
Cm Kcr

Updated on: Jun 08, 2021 | 12:08 AM

మంగళవారం జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆసక్తికరంగా మారింది. ఎన్నో కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ కొనసాగింపు.. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అంశాలతో పాటు ఉద్యోగులకు సంబంధించిన అంశంపై కూడా చర్చించనుంది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు ముఖ్యమైన అంశం వేతన సవరింపు సంఘం (PRC) కూడా అజెండాలో ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పీఆర్సీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు.

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు పీఆర్‌సీ అంశం చర్చకు రానుంది. ఉద్యోగుల వేతన సవరణ నివేదికను మంత్రివర్గం ఆమోదించనుంది. ఇప్పటికే వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్థిక శాఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల ఫిట్‌మెంట్‌, ఇతర అంశాలపై ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ పీఆర్‌సీని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: Income Tax E-filing Portal: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లాంచ్.. ఇక చెల్లింపులు చాలా ఈజీ

 Tv9 Effect: డబ్బు జబ్బు పట్టిన ఆస్పత్రులకు చెక్ పెట్టిన టీవీ 9.. తెలంగాణ సర్కార్ కొరడాతో దారిలోకి..

JioSaavnTV: జియో నుంచి సరికొత్త వీడియో ప్లాట్ ఫామ్.. ప్రత్యేకమైన వీడియో ఫీచర్‌ విడుదల