సెప్టెంబర్‌లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..!

సెప్టెంబర్‌లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..!

సెప్టెంబర్‌ మొదటి రెండు వారాల్లో బడ్జెడ్ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. గణేష్ నవరాత్రులు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమావేశాల తేదీలు త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ఆయా శాఖల నుంచి అందిన ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్ కసరత్తు ప్రారంభించారు. బడ్జెట్ కసరత్తుపై సీఎం కేసీఆర్ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు.. సెప్టెంబర్ నెలాఖరుతో ముగుస్తోంది. 1 లక్షా 82 వేలా 17 కోట్ల రూపాయల అంచనా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 25, 2019 | 11:52 AM

సెప్టెంబర్‌ మొదటి రెండు వారాల్లో బడ్జెడ్ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. గణేష్ నవరాత్రులు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమావేశాల తేదీలు త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ఆయా శాఖల నుంచి అందిన ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్ కసరత్తు ప్రారంభించారు. బడ్జెట్ కసరత్తుపై సీఎం కేసీఆర్ అధికారులతో భేటీ అయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు.. సెప్టెంబర్ నెలాఖరుతో ముగుస్తోంది. 1 లక్షా 82 వేలా 17 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్నెళ్ల ఖర్చుకు ఓటాన్ అకౌంట్ అనుమతి తీసుకొంది. ఇక ఇప్పుడు ఓటాన్ అకౌంట్ స్థానంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థికశాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి.

సీఎం కేసీఆర్ సమీక్ష…

సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబడులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తగ్గుదల ఉందని.. పన్నుల వాటా కూడా తక్కువగా వస్తోందని వివరించారు. అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వ ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

త్వరలోనే బడ్జెట్ సమావేశాల తేదీలు..

సెప్టెంబర్ మాసం ప్రథమార్థంలోనే సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. త్వరలోనే తేదీలు కూడా ఖరారు కానున్నాయి. గణేష్ నవరాత్రులు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్ హైకోర్టులో ఈనెల 28న విచారణకు రానుంది. ఒకవేళ ఎన్నికల నిర్వహణకు కోర్టు అనుమతిస్తే వచ్చే నెల మూడు లేదా నాలుగో వారంలో పురపోరు జరిగే అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే వరకే…. బడ్జెట్ సమావేశాలను పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu