Telangana Budget 2025 Highlights: తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత.. భట్టి విక్రమార్క ప్రసంగంలో ముఖ్యాంశాలు
Telangana Budget 2025 Highlights: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఓటాన్‌అకౌంట్ బడ్జెట్‌ను మూడు నెలల కాలానికి ప్రవేశపెట్టింది.ఇక 2024 జులై 25న మిగిలిన 9 నెలల కోసం రూ.2.90 లక్షల కోట్లతో..

Telangana Budget 2025 Live Updates in Telugu: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ప్రస్తుత ఏడాది బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది పద్దు రూ. 3 లక్షల కోట్లు దాటనుంది. మార్చి 19 ఉదయం 11 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఐటీ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఓటాన్‌అకౌంట్ బడ్జెట్‌ను మూడు నెలల కాలానికి ప్రవేశపెట్టింది.ఇక 2024 జులై 25న మిగిలిన 9 నెలల కోసం రూ.2.90 లక్షల కోట్లతో పూర్తి పద్దును సభలో ప్రవేశపెట్టింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆసారే ప్రవేశపెట్టబోతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు అధికంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. దీంతో పాటుగా.. వ్యవసాయం, నీటిపారుదల, విద్య, రోడ్లు-భవనాలు, ఇంధన శాఖలకు, గృహనిర్మాణం అత్యధికంగా నిధులు దక్కనున్నాయి. పూర్తి బడ్జెట్ ప్రతుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
LIVE NEWS & UPDATES
-
శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌బాబు
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు సభల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టగా, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
-
ప్రసంగంలో భట్టి ఇంకా ఏమన్నారంటే..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క.. అంబేద్కర్ స్పూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని అన్నారు. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తెలంగాణ తాత్కాలిక, దీర్థకాలిక ప్రయోజనాలే ముఖ్యం. మాపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారని, అబద్ధపు వార్తలతో ప్రజలు మోసం చేస్తున్నారని అన్నారు. అబద్దపు విమర్శలను తిప్పి కొడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు మా నినాదం అని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో సీఎం పాలనను ముందుకు నడిపిస్తున్నారు. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం 200 బిలియన్ డాలర్లు. రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్లు ఉండేలా కార్యాచరణ ఉందన్నారు.
-
-
బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత కేటాయించారు..?
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3.4లక్షల కోట్లు. మరి ఏ రంగానికి ఎంత కేటాయించారో చూద్దాం..
- 2025: రూ.26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు.
- రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు.
- మూలధన వ్యయం రూ.36,504 కోట్లు.
బడ్జెట్ కేటాయింపులు..
- బీసీ అభివృద్ధి: రూ.11,405కోట్లు
- చేనేత రంగానికి: రూ.371
- పౌరసరఫరాల శాఖ: రూ. 5734 కోట్లు
- విద్య : రూ. 23,108కోట్లు
- పంచాయతీ &రూరల్ డెవలప్‌మెంట్ : రూ.31605 కోట్లు
- రైతు భరోసా: రూ. 18,000 కోట్లు.
- మహిళా, శిశు సంక్షేమం : రూ.2,862 కోట్లు
- వ్యవసాయ రంగానికి : రూ.24,439 కోట్ల రూపాయలు
- పశుసంవర్ధక శాఖకు : రూ.1,674 కోట్లు.
- పౌరసరఫరాల శాఖకు : రూ.5,734 కోట్లు.
- ఎస్సీ అభివృద్ధి : రూ.40,232 కోట్లు
- ఎస్టీ అభివృద్ధి: రూ.17,169 కోట్లు
- మైనారిటీ: రూ.3,591కోట్లు
- విద్యాశాఖకు: రూ.23,108 కోట్లు
- షెడ్యూల్ కులాలు: రూ.40,232 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖకు: రూ.31,605 కోట్లు
- మహిళా శిశు సంక్షేమశాఖ: రూ.2,862 కోట్లు.
- కార్మిక ఉపాధి కల్పన: రూ.900 కోట్లు
- షెడ్యూల్ తెగలు: రూ.17,169 కోట్లు.
- నీటి పారుదల శాఖకు: రూ.23,373 కోట్లు
- రోడ్డు భవనాలు శాఖకు: రూ.5907 కోట్లు
- వెనుకబడిన తరగతుల సంక్షేమానికి: రూ.11,405 కోట్లు.
- ఐటీ శాఖకు: రూ.774 కోట్లు
- విద్యుత్ శాఖకు: రూ.21,221 కోట్లు
- మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు: రూ.17,677 కోట్లు
- దేవాదాయ శాఖకు: రూ.190 కోట్లు
- హోంశాఖకు: రూ. 10,188 కోట్లు
- పర్యాటక శాఖకు: రూ.775 కోట్లు
- క్రీడా శాఖకు: రూ.465 కోట్లు.
- అడవులు, పర్యావరణ శాఖకు: రూ.1023 కోట్లు
-
మహిళల కోసం ప్రత్యేక నిధులు
- మహిళా శక్తి భవనాల ఏర్పాటుకు రూ.110 కోట్లు
- 214 మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం
- గిరిజనాభివృద్ధి కోసం ఇందిరా గిరి జలవికాసం పథకం
- 2.1 లక్షల గిరిజన రైతులకు పౌర ఆధారిత పంపు సెట్లు
- రాజీవ్ యువ వికాసం పథకం ఒక గేమ్ ఛేంజర్
- యువ వికాసం పథకం లబ్దిదారులకు రూ.4 లక్షలు ఆర్థిక సాయం
- 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటు
- అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లలో ఉచితంగా గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ సెంటర్లు
-
త్వరలో అంగన్‌వాడీ పోస్టులు భర్తీ
త్వరలో 14,236 అంగన్‌వాడీల పోస్టుల భర్తీను భర్తి చేయనున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గృహజ్యోతి పథకంతో 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి కనీసం 3500 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ORR ఆనుకుని హైదరాబాద్ నాలుగువైపులా శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్మించనున్నట్లు చెప్పారు. రూ.2 లక్షలలోపు రైతురుణాలు మాఫీ చేశామని, 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్లు మాఫీ జరిగిందన్నారు.
-
-
బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత?
- త్వరలో 14,236 అంగన్‌వాడీల పోస్టుల భర్తీ
- గృహజ్యోతి పథకంతో 50 లక్షల కుటుంబాలకు లబ్ధి
- రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
- నియోజకవర్గానికి కనీసం 3500 ఇళ్ల నిర్మాణం
- ORR ఆనుకుని హైదరాబాద్ నాలుగువైపులా శాటిలైట్ టౌన్‌షిప్‌లు
- రూ.2 లక్షలలోపు రైతురుణాలు మాఫీ చేశాం
- 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్లు మాఫీ
- క్రీడలు రూ.465 కోట్లు
- అడవులు – పర్యావరణం రూ.1023 కోట్లు
- దేవదాయ శాఖ రూ.190 కోట్లు
- హోంశాఖ రూ.10,188 కోట్లు
- ఎస్సీ సంక్షేమం రూ.40,232 కోట్లు
- ఎస్టీ సంక్షేమం రూ.17,169 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.11,405 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ. 31605 కోట్లు
- మహిళా శిశుసంక్షేమం రూ.2862 కోట్లు
-
ఇందిరమ్మ ఇళ్లకు భారీగా నిధులు
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఈ బడ్జెట్‌లో భారీగానే నిధులు కేటాయించే అవకాశం ఉంది. నాలుగేళ్లలో 20 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 37 వేల 274 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్‌సభ ఎన్నికల కారణంగా 2024 ఫిబ్రవరిలో తొలుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. ఏప్రిల్, మే, జూన్ నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024 జులై 25న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్. అయితే ఒక ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇప్పుడే ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్.
-
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు
తెలంగాణ ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంచనా 3 లక్షల 10 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ప్రజాభవన్‌లో ఉన్న ఆలయంలో బడ్జెట్ ప్రతులతో పూజలు చేశారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క. భట్టి దంపతులు పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి అసెంబ్లీకి బయల్దేరి వెళ్లారు.
-
రూ. 3,04,965 కోట్లతో వార్షిక బడ్జెట్
- రూ. 3,04,965 కోట్లతో వార్షిక బడ్జెట్
- రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు
- మూలధన వ్యయం రూ.36,504 కోట్లు
- రూ.3.10 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్
- విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యత
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ. 31605 కోట్లు
- మహిళా శిశుసంక్షేమం రూ.2862 కోట్లు
- పశుసంవర్థక శాఖ రూ.1674 కోట్లు
- పౌరసరఫరాల శాఖ రూ.5734 కోట్లు
- విద్యాశాఖ రూ.23,108 కోట్లు
- చేనేత రూ.371 కోట్లు
- మైనారిటీ సంక్షేమం రూ.3591 కోట్లు
- పరిశ్రమల శాఖ రూ.3527 కోట్లు
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూ.774 కోట్లు
- విద్యుత్ శాఖ రూ.21,221 కోట్లు
- వైద్యం, ఆరోగ్యం రూ.12,393 కోట్లు
- ఎస్సీ సంక్షేమం రూ.40,232 కోట్లు
- ఎస్టీ సంక్షేమం రూ.17,169 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.11,405 కోట్లు
-
హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా తీర్చడానికి మూసీ ప్రాజెక్టు
భట్టి వార్షిక బడ్జెట్ ప్రసంగంలో.. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా తీర్చడానికి మూసీ ప్రాజెక్టును చేపడుతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, మెడికల్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేలా కేటాయింపులు ఉంటాయన్నారు.
-
మూడో సారి భట్టి బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమర్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఆర్థిక మంత్రిగా భట్టి మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. డ్జెట్ ప్రసంగం సందర్భంగా బీఆర్‌ఎస్ నేతల నినాదాలు.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు.
-
బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమర్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. బడ్జెట్ సంబంధించి వివరాలు వెల్లడిస్తున్నారు.
-
కాసేపట్లో వార్షిక బడ్జెట్
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖమంత్రి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
Published On - Mar 19,2025 10:34 AM




