Telangana: గుండెపోటుతో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధిని మృతి.. నిర్మల్‌ జిల్లాలో ఘటన!

వయసుతో సంబంధం లేకుండా తెలంగాణలో గుండె పోటు మరణాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఎవరి గుండె ఎందుకు ఏ సమయంలో ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఐదేళ్ల పిల్లాడి నుంచి ముసలివాళ్ల వరకు అన్ని వయసుల వారు గుండెపోటుకు గురికావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా గుండెపోటుతో..

Telangana: గుండెపోటుతో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధిని మృతి.. నిర్మల్‌ జిల్లాలో ఘటన!
Heat Attack

Updated on: Feb 25, 2024 | 11:11 AM

నిర్మల్, ఫిబ్రవరి 25: వయసుతో సంబంధం లేకుండా తెలంగాణలో గుండె పోటు మరణాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఎవరి గుండె ఎందుకు ఏ సమయంలో ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఐదేళ్ల పిల్లాడి నుంచి ముసలివాళ్ల వరకు అన్ని వయసుల వారు గుండెపోటుకు గురికావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా గుండెపోటుతో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధిని కుప్పకూలింది. ఈ షాకింగ్‌ ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (బి) మండలంలోని బామిని (బి) గ్రామానికి చెందిన నార్వాడే హాసిని (18) అనే యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. కాగా ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో తాజాగా హాసిని హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో గత గురువారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీననిర్మల్‌ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతిచెందింది. కాగా మృతురాలు హాసిని తండ్రి నార్వాడే వెంకట్రావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కళ్ల ముందే కూతురు ప్రాణాలు వదలటం చూసి, హాసిని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

జగిత్యాల: తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన ఇంటర్‌ విద్యార్థిని

తల్లిదండ్రులు తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన జగిత్యాల జిల్లాకేంద్రంలో శనివారం (ఫిబ్రవరి 24) చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్‌ మండలం పొలాస గ్రామానికి చెందిన విద్యార్థిని (20)కి రాయికల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవల పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 26న నిశ్చితార్థం జరపాలని నిర్ణయించారు. అయితే ఇంటి నుంచి పారిపోయిన విద్యార్ధిని జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఆరీఫ్‌ అలీఖాన్, ఎస్సై సుధాకర్‌లకు ఫిర్యాదు చేసింది. తాను ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నానని, ఇప్పుడే పెళ్లి చేసుకోనని, ఇంకా చదువుకోవాలని ఉందని పోలీసులకు తెల్పింది. దీనిపై స్పందించిన పోలీసులు విద్యార్ధిని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం సదరు విద్యార్థినిని సఖీ కేంద్రానికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.