AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఒక్కటైన లండన్ అమ్మాయి… నల్లగొండ అబ్బాయి.. ఆమె పోలీస్ డిపార్ట్‌మెంట్

ప్రేమకు ఎల్లలు లేవంటారు.. ప్రస్తుతం ప్రేమ కుల, మతాలకు అతీతకంగా సరిహద్దుల చెరిపేస్తుంది.   తాము పనిచేసే చోట లేదా.. చదువుకుంటున్న సమయంతో ఏర్పడిన పరిచయాలు ప్రేమగా మారుతున్నాయి. జాతి, మతం, కులం వంటి బేధాలను పక్కకు పెట్టి ప్రేమని పండించుకోవాలని.. పెళ్లి చూసుకోవాలని భావిస్తున్నారు నేటి యువతీయువకులు. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళుతున్న యువత, పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే మరో తెలుగు యువకుడి ప్రేమ కథ కూడా ఖండాంతరాలను దాటింది.

Telangana: ఒక్కటైన లండన్ అమ్మాయి... నల్లగొండ అబ్బాయి.. ఆమె పోలీస్ డిపార్ట్‌మెంట్
Rajeev Reddy - Lawren Fisher
M Revan Reddy
| Edited By: |

Updated on: Feb 03, 2025 | 12:50 PM

Share

ప్రేమ ఖండాంతరాలను దాటుతోంది. విదేశీ యువతీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాడు నల్లగొండ జిల్లా యువకుడు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన కందిమళ్ల జోగారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, ప్రేమలత దంపతుల కుమారుడు రాజీవ్ రెడ్డి పదేళ్ల క్రితం హోటల్ మేనేజ్మెంట్ ఉన్నత విద్య కోసం న్యూజిలాండ్ దేశానికి వెళ్లాడు. ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న రాజీవ్ రెడ్డి న్యూజిలాండ్‌లోనే ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇదే సమయంలో లండన్ మాంచెస్టర్‌కు చెందిన లారెన్ ఫిషర్ న్యూజిలాండ్ ఉండే తన పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటుంది. రాజీవ్ రెడ్డి ఉండే ఇంటి సమీపంలో లారెన్ ఫిషర్ వాళ్ల ‘పెద్దమ్మ నివాసం కూడా ఉండేది. ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన మహమ్మారి కరోనా సమయంలో ఓ హోటల్ రాజీవ్ రెడ్డికి లారెన్ ఫిషర్‌కు పరిచయం ఏర్పడింది. ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో అప్పుడప్పుడు వారు కలుసుకునేవారు. లారెన్ ఫిషర్ ఉన్నత విద్య తర్వాత అక్కడి పోలీస్ శాఖలో సైకాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా కొనసాగుతున్న వీరి ప్రేమను ఇరు కుటుంబాలు తొలుత అంగీకరించలేదు.

చివరికి రాజీవ్ రెడ్డి.. లారెన్ ఫిషర్‌లు తమ కుటుంబాలకు నచ్చజెప్పి పెండ్లికి అంగీకరించేలా చేశారు. వివాహానికి లారెన్ ఫిషర్ కుటుంబ సభ్యులు లండన్నుంచి హైదరాబాద్ వచ్చారు. నగరంలోని ఓ ఫంక్షన్ హల్ లో రాజీవ్ రెడ్డి లారెన్ ఫిషర్ల వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల సాక్షిగా ఘనంగా నిర్వహించారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడి పెళ్లి సంప్రదాయాలు తమకు ఎంతగానో నచ్చాయని ఫిషర్ తల్లిదండ్రులు కె. ఫిషర్, డేవిడ్ ఫిషర్ తెలిపారు. తమ కుమార్తెను సంప్రదాయాలకు అత్యంత గౌరవం, విలువనిచ్చే తెలుగింటికి పంపండం చెప్పలేని సంతోషాన్ని కలిగించిందని వారన్నారు.

Love Knows No Borders

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం