Telangana BJP: బీజేపీ పవర్‌ఫుల్ స్ట్రాటెజీ..! నేడు మంత్రుల ఘెరావ్.. రేపు కలెక్టరేట్ల ముట్టడి.. ఆ తర్వాత..

|

Aug 24, 2023 | 8:06 AM

BJP strategy in Telangana: అధికారమే పరమావధి.. అందుకు ఏ పార్టీ అతీతం కాదు.. ఎన్నికల యుద్ధానికి మూడు నెలల గడువుంది.. అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.. అధికార పార్టీ ఓ అడుగు ముందుకేసి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. ప్రతిపక్షమైన కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే ఉన్నాయి.

Telangana BJP: బీజేపీ పవర్‌ఫుల్ స్ట్రాటెజీ..! నేడు మంత్రుల ఘెరావ్.. రేపు కలెక్టరేట్ల ముట్టడి.. ఆ తర్వాత..
Telangana BJP
Follow us on

BJP strategy in Telangana: అధికారమే పరమావధి.. అందుకు ఏ పార్టీ అతీతం కాదు.. ఎన్నికల యుద్ధానికి మూడు నెలల గడువుంది.. అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.. అధికార పార్టీ ఓ అడుగు ముందుకేసి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. ప్రతిపక్షమైన కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే ఉన్నాయి. అయితే, బీఆర్‌ఎస్‌ను మట్టి కరిపిస్తామంటున్న బీజేపీ.. వరుస ప్రోగ్రామ్స్‌తో కేసీఆర్‌ సర్కార్ ను టార్గెట్‌ చేస్తోంది. ఎన్నికలకు ముందు మూడు నెలల పాటు నాన్‌స్టాప్‌ ప్రోగ్రామ్స్‌తో పక్కాగా సెట్‌ చేసుకుంది బీజేపీ.. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో.. బీజేపీ జీతావో అనే నినాదంతో కమలనాథులు ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్‌పై మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రణాళికలో భాగంగా గురువారం మంత్రుల ఘెరావ్, శుక్రవారం కలెక్టరేట్‌ ముట్టడి.. సెప్టెంబర్‌ 7న ఛలో హైదరాబాద్.. లాంటి కార్యక్రమాలతో బీజేపీ వరుస కార్యక్రమాలకు పిలుపునచ్చింది. తెలంగాణలో ప్రత్యేక వ్యూహంతో అధికార పార్టీని అటాక్‌ చేయాలని భావిస్తోన్న నేతలు.. అధిష్టానం సూచనలతోపాటు.. లోకల్‌ పరిస్థితులకు అనుగుణంగా స్టైల్‌ మార్చుతూ ఉద్యమాన్ని ప్రారంభించింది. బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై మలిదశ ఉద్యమం పేరుతో పోరాటం చేయాలని డిసైడ్‌ అయ్యారు.

నెల రోజుల్లో ఆ నియోజకవర్గాల్లో సభలు..

తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్‌ దుకుడు పెండగా.. బీజేపీ మాత్రం చాలా సైలెంట్‌గా ఇన్‌సైడ్‌ వర్క్ చేస్తోంది. ఈ క్రమంలోనే.. రిజర్వుడ్‌ స్థానాలపై గురి పెట్టి ఆయా నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు వేసింది. రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. నెల రోజుల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసింది. తాజాగా.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బూత్‌ స్థాయి సమ్మేళనం నిర్వహించింది తెలంగాణ బీజేపీ. ఈ కార్యక్రమంలో.. బీజేపీ అగ్రనేత సునీల్‌ బన్సాలీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కేసీఆర్‌ ప్రభుత్వం కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. బీజేపీ జీతావో

కేసీఆర్‌ సర్కార్‌పై బీజేపీ మలిదశ ఉద్యమం చేస్తుందన్నారు ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ లక్ష్మణ్. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. బీజేపీ జీతావో నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. ఈ సారి డకవుట్ ఖాయమని సొంత సర్వేల్లో తేలడంతోనే కేసీఆర్‌ ఫ్రస్టేట్‌ అవుతున్నారని ఎద్దేవా చేశారు లక్ష్మణ్‌. మొత్తంగా… తెలంగాణలో బీజేపీ స్ట్రాటజిక్‌గా ముందుకెళ్తోంది. రిజర్వుడ్‌ స్థానాలపై దృష్టి సారించి.. వాటిని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఎన్నికలకు మరో మూడు నెలలు సమయం ఉండటంతో రాబోయే రోజుల్లో ఇంకెలాంటి ప్లాన్స్‌ అమలు చేస్తుందో చూడాలి.