Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో ఉన్నది వీరేనా..? హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరుకుందా ?.. ఏ క్షణమైన దీనిపై ఢిల్లీ నాయకత్వం ప్రకటన చేసే అవకాశం ఉందా ?.. ఇప్పటికే ఈ అంశంపై అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన ఆ పార్టీ అగ్రనేతలు.. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చేశారా ?.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఢిల్లీకి ఎందుకు వెళ్లారు.. పూర్తి వివరాలను తెలుసుకోండి..

Telangana BJP: తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో ఉన్నది వీరేనా..? హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి..
Telangana Bjp
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 24, 2025 | 8:30 AM

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలకుగానూ 2 సీట్లును గెలుచుకుని తమ రాజకీయ బలాన్ని మరింతగా పెంచుకుంది. ఈ క్రమంలోనే చాలాకాలంగా పెండింగ్‌లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియమాకాన్ని కూడా పూర్తి చేసి మరింత దూకుడుగా తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోవాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు.

హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి

ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రిగానూ కొనసాగుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. కానీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే సమయం దగ్గరపడిందని.. అతి త్వరలోనే దీనిపై ప్రకటన రావొచ్చనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. తాజాగా హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆయన ఈ అంశంపైనే పార్టీ పెద్దలతో చర్చిస్తారని.. కిషన్ రెడ్డితో చర్చించిన తరువాత కొత్త అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన రావొచ్చనే ప్రచారం సాగుతోంది.

అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుని కొత్త చీఫ్ ఎంపిక

తెలంగాణ బీజేపీ కొత్త బాస్ ఎంపికపై ఇప్పటికే పలు దఫాలుగా నేతల అభిప్రాయాలను సేకరించింది బీజేపీ నాయకత్వం. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న బీజేపీని మరింత దూసుకెళ్లేలా కొత్త నాయకత్వం ఎంపిక ఉండాలని అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటూనే.. రాష్ట్రంలోని నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండే నాయకుడికి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.

క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి నేతల పేర్లు అధ్యక్ష రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తాను పార్టీ అధ్యక్ష రేసులో లేనని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ అంశంలో పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈటల రాజేందర్ చెబుతూ వస్తున్నారు. ఈసారి తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయని.. వాటిని మరింత మెరుగుపరిచేలా కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉండాలని కసరత్తు చేస్తోంది. అయితే కేవలం కొత్త అధ్యక్షుడి ఎంపికతో పార్టీ నాయకత్వం సరిపెడుతుందా ? పార్టీలో మరిన్ని మార్పులు చేర్పులు ఉంటాయా ? అనే అంశం కూడా ఆసక్తిరేపుతోంది.

రేసులో ఉన్నది వీరేనా..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరు షార్ట్ లిస్ట్ అయినట్టు సమాచారం.. అయితే.. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల పరిశీలకురాలుగా ఉన్న శోభా కరంద్లాజే ఇప్పటికే రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాన్ని తీసుకుని అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ బ్యాగు వద్ద ఆగిన పోలీస్ డాగ్.. పోలీసులు ఓపెన్ చేయగా షాక్
ఆ బ్యాగు వద్ద ఆగిన పోలీస్ డాగ్.. పోలీసులు ఓపెన్ చేయగా షాక్
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..