Bandi Sanjay: పాదయాత్రలో రైతు కోరిక తీర్చిన బండి సంజయ్.. ట్రాక్టర్ నడిపి.. పొలంలో దమ్ము చేసి..

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యత్ర జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో కొనసాగుతోంది.

Bandi Sanjay: పాదయాత్రలో రైతు కోరిక తీర్చిన బండి సంజయ్.. ట్రాక్టర్ నడిపి.. పొలంలో దమ్ము చేసి..
Bandi Sanjay

Updated on: Dec 10, 2022 | 6:03 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యత్ర జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో కొనసాగుతోంది. శనివారం కోరుట్ల నియోజకవర్గంలోని యూసుఫ్ నగర్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రలో బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ రైతు కోరిక మేరకు బండి సంజయ్ ట్రాక్టర్ నడిపి, పొలంలో దమ్ము చేశారు.

జగిత్యాల కోరుట్ల నియోజకవర్గం.. ఐలాపూర్ గ్రామ సమీపంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ని చూసిన ఓ రైతు.. ఆయన వద్దకు వచ్చి తన పొలంలో ట్రాక్టర్‌తో దమ్ము చేయాలని కోరారు. రైతు కోరికను స్వాగతించిన సంజయ్.. పొలంలోకి అడుగుపెట్టారు. ట్రాక్టర్‌తో దమ్ము చేసి బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచారు.

రైతు కోరికను తీర్చిన బండి సంజయ్‌ను కార్యకర్తలు నినాదాలు చేస్తూ అభినందించారు. అనంతరం పాదయాత్రను బండి సంజయ్ ముందుకు సాగించారు.

ఇవి కూడా చదవండి

Bandi Sanjay Kumar

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు గ్రామాల్లో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..