Eatala Rajender: బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఈటల రాజేందర్

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ త్వరలోనే బీజేపీకి గుబ్‌బై చెబుతారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారన్నది ఆ పుకార్ల సారాంశం. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Eatala Rajender: బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఈటల రాజేందర్
Etela Rajender

Updated on: May 18, 2023 | 4:07 PM

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ త్వరలోనే బీజేపీకి గుబ్‌బై చెబుతారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారన్నది ఆ పుకార్ల సారాంశం. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార తీరుపై ఢిల్లీలోని పార్టీ పెద్దలకు ఈటల ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్ంయలో ఈ కథనాలపై ట్విట్టర్ వేదికగా ఈటల స్పందించారు.  తాను పార్టీ మారనున్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు నియంతృత్వ కేసీఆర్ సర్కారును అంతమొందించడమే తన లక్ష్యమని అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడం ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సార్థ్యంలో నడుస్తున్న బీజేపీతోనే సాధ్యమన్నారు.

బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఈటల స్పష్టంచేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేతలందరూ సమిష్టిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. పదేపదే పార్టీలు మారడం తన విధానం కాదన్నారు. పార్టీ మారుతున్నట్లు తనను సంప్రదించకుండానే కథనాలు ప్రచురించడం సరైన పద్ధతి కాదన్నారు.

ఇవి కూడా చదవండి

ఈటల రాజేందర్ క్లారిటీ..

కాగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే తన రాజకీయ ప్రత్యర్థులే ఇలాంటి పుకార్లను సృష్టిస్తున్నారని.. ఇందులో నిజం లేదంటూ కోమటిరెడ్డి స్పష్టంచేశారు.బీజేపీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టంచేశారు. తన అభిమానులను గందరగోళానికి గురిచేసేందుకే ఇలాంటి పుకార్లను సృష్టిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీచేస్తానని ఆయన స్పష్టంచేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్..

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..