Telangana BJP: గెలుపే లక్ష్యం.. బండి సంజయ్ వర్గాన్ని కలుపుకొనిపోయే పనిలో ఈటల రాజేందర్..
Etela Rajender: ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్లి రాత్రి పగలు కష్టపడి బీజేపీ అని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని చెప్పడంతో ఈటల రాజేందర్ లోని జోష్ మరింత రెట్టింపు అయ్యింది. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ ఇంటిని చక్కబెట్టే పనిలో ఉన్నారు. తన నియామకంతో పాటు బండి సంజయ్ తొలగింపు పై..

బండి సంజయ్ వర్గాన్ని కలుపుకొని వెళ్తున్నారు తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్. తెలంగాణ బీజేపీ ఎన్నికల సారధిగా బాధ్యతలు చేపట్టిన ఈటల రాజేందర్ మంచి దూకుడు మీదున్నారు. అది వచ్చిన దగ్గర నుంచి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. శనివారం వరంగల్ సభలో కూడా ఆయనలో జోష్ కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్లి రాత్రి పగలు కష్టపడి బీజేపీ అని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని చెప్పడంతో ఈటల రాజేందర్ లోని జోష్ మరింత రెట్టింపు అయ్యింది. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ ఇంటిని చక్కబెట్టే పనిలో ఉన్నారు. తన నియామకంతో పాటు బండి సంజయ్ తొలగింపు పై అసంతృప్తిగా ఉన్న నేతలను మొదట కలవాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆయన బండి సంజయ్ వర్గానికి చెందిన నేతలు ఎంపీ బండి సంజయ్ కుమార్‌తో కలిసి ప్రయాణం చేసిన నేతలను కలవాలని ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే బండి సంజయ్ వర్గంలో అత్యంత కీలకపాత్ర పోషించిన గరికపాటి మోహన్ రావు, ఏ చంద్రశేఖర్ ను ఆదివారం రోజు కలిశారు. అంతకుముందే జితేందర్ రెడ్డితో ఈటల రాజేందర్ ఫామ్‌హౌస్‌లో భేటీ అయ్యారు. చాలా అంశాలపై ఇద్దరు నేతలు మాట్లుడుకున్నట్లుగా సమాచారం.. రేపు ఎల్లుండి విజయశాంతి వివేక్ వెంకటస్వామి వంటి బీజేపీ సీనియర్ నాయకులను కలిసి పలు విషయాలపై మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వంలో మొదట నాయకులందరినీ సమన్వయ పరిచే బాధ్యతలను ఈటల రాజేందర్ తీసుకొన్నట్లుగా తెలుస్తోంది. ఈటల రాజేందర్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
