Telangana: ప్రాణాలను హరిస్తున్న రైల్వే గేట్.. సరిగ్గా ఆ సమయంలోనే గేటు పడటంతో..
రోడ్డు మార్గం మధ్యలో రైల్వే గేట్.. జనాల ప్రాణాలను హరిస్తోంది. కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని తీగలగుట్టపల్లి రైల్వే గేటుతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్‌లోని ఆసుపత్రులకు ఉమ్మడి జిల్లాతో పాటు, ఆదిలాబాద్ జిల్లా నుంచి రోగులను అంబులెన్స్‌ల్లో తీసుకు వచ్చినా రైల్వే గేటు కారణంగా ప్రాణాలు పోతున్నాయి.

రోడ్డు మార్గం మధ్యలో రైల్వే గేట్.. జనాల ప్రాణాలను హరిస్తోంది. కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని తీగలగుట్టపల్లి రైల్వే గేటుతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్‌లోని ఆసుపత్రులకు ఉమ్మడి జిల్లాతో పాటు, ఆదిలాబాద్ జిల్లా నుంచి రోగులను అంబులెన్స్‌ల్లో తీసుకు వచ్చినా రైల్వే గేటు కారణంగా ప్రాణాలు పోతున్నాయి. తాజాగా అలాంటి పరిస్థితే.. ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్తంభంపల్లికి చెందిన విజయ్‌కి గుండెపోటు రావడంతో కరీంనగర్‌కు తరలిస్తుండగా రైల్వే గేట్ పడింది. సుమారు 20 నిమిషాల పాటు అంబులెన్స్‌లోనే విజయ్ కొట్టుమిట్టాడాడు. బాధితుడికి అంబులెన్స్‌లోనే సీపీఆర్ కూడా చేశారు. తీరా ఆసుపత్రిలో చేర్చగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రైల్వే గేట్ పడకుంటే విజయ్ బతికేవాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులు, రోదనలతో స్తంభంపల్లిలో విషాదం నెలకొంది. బ్రిడ్జ్ నిర్మించాలని గత తొమ్మిదేళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
