AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటే పొరపాటే.. ఇది బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ !

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. అందులో కరీంనగర్ పేరును 'కరినగర్' గా పేర్కొన్నారు.

Telangana: స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటే పొరపాటే.. ఇది బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ !
Bjp Chalo Karinagar
Ram Naramaneni
|

Updated on: Dec 15, 2022 | 5:29 PM

Share

తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో ముగిసింది. ఈ క్రమంలోనే గురువారం కరీంనగర్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ వంటి పెద్దలు ఈ సభకు హాజరయ్యారు.  పత్రికల్లో కూడా ఈ సభ గురించి ప్రచారం గట్టిగా చేశారు. ఈ ప్రచార ప్రకటన ప్రజంట్ నెట్టింట్ వైరల్‌గా మారింది. అందులో ‘కరీంనగర్’, పేరును కరినగర్‌ అని పేర్కొన్నారు. ఆంగ్ల దినపత్రికలతో పాటు తెలుగు పత్రికల్లోనూ ఇలానే ముద్రణ ఉంది. మొదట్లో ఇది స్పెల్లింగ్ మిస్టేక్ అని భావించారు.  కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. జిల్లాను వేరే పేరుతో ప్రచురించడం వెనుకు బీజేపీకి ఉద్దేశపూర్వక ఎత్తుగడ ఉన్నట్లే తెలుస్తుంది.

గతంలో నిజాం పరిపాలించాడు కాబట్టి జిల్లాల పేర్లన్నీ దాదాపు ముస్లిం పేర్లకు సారూప్యంగా ఉన్నాయి. ‘కరీంనగర్’ కూడా అలానే ‘కరీం’  అనే ముస్లిం పేరు ప్రతిబింబించే విధంగా ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే హైదరాబాద్‌తో సహా ముస్లిం ఛాయలున్న అన్ని జిల్లాల పేర్లను మార్చుతామని బీజేపీ పదే, పదే చెబుతూ వస్తుంది. ప్రజంట్ అయితే ఓ అడుగు ముందుకు వేసి.. ‘ఛలో కరినగర్’ అని దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలిసింది. సో.. వ్యూహాత్మకంగానే బీజేపీ ఈ పేరును మార్చి ప్రకటన ఇచ్చినట్లు అర్థమవుతుంది.

‘కరీంనగర్’లో ‘కరీం’ అనేది ముస్లిం పేరు ఉంది. అదే ‘కరినగర్’ అని పిలిస్తే.. ‘కరి’ అంటే ఏనుగు కాబట్టి.. ఇలా ఫిక్సయినట్లు తెలుస్తుంది. అంతేకాదు వాడుక భాషలో జిల్లాలోని వృద్ధులు చాలామంది ఇప్పటికీ ‘కరినగరం’ అని సంభోధిస్తారట. గతంలో ఈ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా సంచరించడంతో ఆ పేరుతో పిలిచేవారని కొందరు అంటున్నారు. సో బీజేపీ పక్కాగా ఆలోచించాక, నిపుణుల నుంచి అభిప్రాయం తీసుకున్నాకే ఈ పేరు ఫిక్సయ్యారని సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!