Kishan Reddy: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లే.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్‌ఎస్ పార్టీ వేసినట్లే, బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లేనని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు పాతనరేసి, బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. జులై 9వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్‌కు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాట్లను సమీక్షించిన...

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్‌ఎస్ పార్టీ వేసినట్లే, బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లేనని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు పాతనరేసి, బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. జులై 9వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్‌కు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్‌ను తెలంగాణ సమాజం క్షమించదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని విషయాల్లో వైఫల్యం చెందిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నో ఆశలతో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం చేతిలో బంధీ అయ్యిందని విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం నిజాం తరహా పాలన సాగుతోందన్న కిషన్ రెడ్డి.. మొదట దళితులను మోసగించడం ద్వారా కేసీఆర్ మోసాలను ప్రారంభించారన్నారు. ఎక్కడ బంగారు తెలంగాణ..? కల్వకుంట్ల కుటుంబం బంగారమైందా..? తెలంగాణ సమాజం బంగారమైందా..? అంటూ ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో అబద్ధాలు ప్రచారం చేసి.. ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ వ్యాపారం చేయాలన్న బీఆర్ఎస్ నాయకులకు వాటా ఇవ్వాలని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి మయమైందని, తెలంగాణ మోడల్ అంటే ఇదేనా.? అంటూ ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి పూర్తి ప్రెస్‌మీట్ ఇక్కడ చూడండి..




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..