AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కాంగ్రెస్‌లో కుల రాజకీయాలు.. ఎటూ తేలని పంచాయితీ.. తెరపైకి కర్ణాటక ఫార్మూలా.?

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కొత్త వివాదం మొదలైంది.. మెజారిటీ ప్రజలుగా మేమున్నా తమకి టికెట్ల కేటాయింపుల విషయంలో ఆది నుండి అన్యాయం జరుగుతుందంటూ..

తెలంగాణ కాంగ్రెస్‌లో కుల రాజకీయాలు.. ఎటూ తేలని పంచాయితీ.. తెరపైకి కర్ణాటక ఫార్మూలా.?
Telangana Congress
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jul 06, 2023 | 7:44 PM

Share

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కొత్త వివాదం మొదలైంది.. మెజారిటీ ప్రజలుగా మేమున్నా తమకి టికెట్ల కేటాయింపుల విషయంలో ఆది నుండి అన్యాయం జరుగుతుందంటూ బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. బిసిలకు జనాభా దామషా ప్రకారం టికెట్ల కేటాయింపునకు అధిష్టానం సానుకూలంగా ఉన్నా.. రాష్ట్ర నేతలు మాత్రం భిన్నంగా వ్యవహారిస్తున్నారు.. ఇంతకీ గాంధీ భవన్‌లో బీసీల పంచాయతీ ఎటు తేల్చబోతున్నారు…? కర్ణాటక ఫార్ములా అమలు చేస్తారా..?

దూకుడుగా వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీల చిచ్చు మొదలైంది. తమకి సరైన సీట్లు కేటాయించాలంటూ కొద్ది రోజులుగా బీసీలు రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తూ నేతలను టికెట్లపై తాడోపేడో తేల్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. బీసీలకు జనాభా దామషా ప్రకారం టికెట్లు కేటాయించాలని టికెట్లు మా హక్కు అని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో టికెట్ల విషయంలో మోసపోయామని ఇప్పుడు ముందుగానే టికెట్లు ప్రకటించాలని కోరుతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 3 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. బీసీలకు టికెట్ల విషయంలో హైకమాండ్ సానుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర నేతల వ్యవహార శైలి సరిగా లేదని బీసీ నేతలు మండిపడుతున్నారు.

బీసీ నేతలకు టికెట్ల విషయంలో సీనియర్ నేత విహెచ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి, పొన్నాల లక్ష్మయ్య, చెరుకు సుధాకర్ లాంటి వారు తమకి అన్యాయం జరుగుతోందని బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనని పార్టీ అంతర్గత చర్చల్లో డిమాండ్ చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు సీట్లకు తగ్గకుండా బీసీలకు అసెంబ్లీ టికెట్ల ఇవ్వాలనే డిమాండ్ చేసున్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా దామాషా ప్రకారం కనీసం 40 – 45 వరకు అడుగుతున్నారు..

పార్టీలో కొన్ని కులాల వారి పెత్తనం వల్ల బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సరైన ప్రాతినిధ్యం ఉండడం లేదని, దీని వల్లే పార్టీ మెజార్టీ ప్రజల ముందు ఇబ్బంది పడుతోందని కాంగ్రెస్ బీసీ నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం వల్లే అక్కడ మెజార్టీ బీసీలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారని, తెలంగాణలోనూ అదే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు కొందరు ఎస్సీ, ఎస్టీ నేతలు కూడా ఈసారి జనరల్ సీట్లలో పోటీకి సిద్దమని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి టికెట్ల ముందుగానే ప్రకటించి బీసీల ప్రాధాన్యత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఈ కొత్త చర్చ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్