AIMIM Manifesto: 365 రోజులు ప్రజల మధ్యలో ఉండటమే ఎజెండా.. ఎంఐఎం మేనిఫెస్టో రిలీజ్!
Telangana Elections: ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో చాలా కీలకం. ఆ మేనిఫెస్టోని బట్టే గెలుపు పోటములు ఆధారపడి ఉంటాయన్నదీ రాజకీయ విశ్లేషకుల నమ్మకం. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తామో చెబుతూ.. పార్టీలు హామీల రూపంలో మేనిఫెస్టోను విడుదల చేస్తాయి. ప్రత్యర్థి పార్టీలంటే అధికంగా మేలు ప్రజలకు జరిగేలా మేనిఫెస్టోను తయారు చేసి ఎన్నికలకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) కూడా తన మేనిఫెస్టోని విడుదల చేసింది.

తెలంగాణ ఎన్నికల వేళ ఓటర్లపై రాజకీయ పార్టీలు వరాలు జల్లులు కురిపిస్తామని హామీ ఇస్తున్నాయి. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే మహిళలకు, సామాజికవర్గాల వారీగా పెద్ద పీట వేస్తామని ఓటర్లను తెగ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికతో పాటు మేనిఫెస్టోలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. హుస్నాబాద్ బహిరంగ సభతో ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు చెబుతూ.. ప్రచారం కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టో సైతం విడుదల చేశారు.
ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో చాలా కీలకం. ఆ మేనిఫెస్టోని బట్టే గెలుపు పోటములు ఆధారపడి ఉంటాయన్నదీ రాజకీయ విశ్లేషకుల నమ్మకం. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తామో చెబుతూ.. పార్టీలు హామీల రూపంలో మేనిఫెస్టోను విడుదల చేస్తాయి. ప్రత్యర్థి పార్టీలంటే అధికంగా మేలు ప్రజలకు జరిగేలా మేనిఫెస్టోను తయారు చేసి ఎన్నికలకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) కూడా తన మేనిఫెస్టోని విడుదల చేసింది.
365 రోజుల పాటు ప్రజల మధ్యలో ఉండటమే తమ ఎజెండా అంటూ ప్రకటించింది ఎంఐఎం పార్టీ. కౌన్సిలర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా పార్టీ ఆఫీసులో నేరుగా ప్రజలను కలవడమే తమ మేనిఫెస్టోలో ప్రధాన అంశమంటూ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటన చేశారు. సాధారణంగా పాతబస్తీలో ఏ చిన్న కార్యక్రమం అయినా, చివరికి చావు బతుకులు జరిగినా ఎంఐఎం నేతలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
చిన్న నేత నుంచి ఎంపీ స్థాయి వరకు అంతా వెళ్లి హాజరవుతామన్నారు. ప్రజలు పిలవడమే ఆలస్యం వెంటనే అక్కడికి చేరుకుంటారు. పెళ్లి వేడుకలకు సైతం పిలిచినా పిలవకపోయినా వెళ్లి వధూవరులను ఆశీర్వదిస్తుంటారని ఆసద్ మొదటి హామీగా ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగిన అదుకునేందుకు కౌన్సిర్లు, ఎమ్మెల్యేలు వెంటనే అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని ఎంపీ వెల్లడించారు. ఇలా నిత్యం జనాల్లో ఉండే ప్రయత్నం దేశంలో ఏ పార్టీ చేయదని ఎంఐఎం నేతలు అంటున్నారు.
అంతేకాకుండా తాము చెప్పిందే చేస్తామని, చేసేదే చెబుతామని ఆ పార్టీ నేత ఆసద్ భరోసా ఇచ్చారు. అయితే ఎంఐఎం మేనిఫెస్టో చూసిన రాజకీయ పార్టీలన్నీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికలు సమీపిస్తే చాలు అనేక హామీలు, ఎన్నో వాగ్ధానాలతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ హామీలు నచ్చితే జనాలు ఆయా పార్టీలకు ఓట్లు వేస్తుంటారు. కానీ కేవలం ప్రజల్లోనే ఉంటామంటూ.. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మేనిఫెస్టో ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. జనానికి ఏం చేస్తారో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో గెలిచి ప్రజా ప్రతినిధి ఎవరైనా సరే.. జనంలో ఉండాల్సిందే కదా అని నిట్టూరుస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
