AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ ఆశావహుల్లో కొత్త టెన్షన్.. ఏకంగా ప్రచారమే బంద్..!

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారతున్నారు. ఆదిలాబాద్‌లో హస్తం పార్టీ ఆశావహులు హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే టికెట్లు ఫైనల్ కాగా.. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో ఇంకా టికెట్లు ఖరారు కాకపోవడంతో ఉత్కంట రేపుతోంది. కొత్తగా పార్టీలోకి చేరుతున్న తాజా మాజీ ఎమ్మెల్యేలతో పాత నేతల్లో సైతం మరింత పీక్ స్టేజ్‌కి చేరుతుందంట.

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ ఆశావహుల్లో కొత్త టెన్షన్.. ఏకంగా ప్రచారమే బంద్..!
Gandhi Bhavan
Naresh Gollana
| Edited By: |

Updated on: Oct 21, 2023 | 4:25 PM

Share

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారతున్నారు. ఆదిలాబాద్‌లో హస్తం పార్టీ ఆశావహులు హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే టికెట్లు ఫైనల్ కాగా.. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో ఇంకా టికెట్లు ఖరారు కాకపోవడంతో ఉత్కంట రేపుతోంది. కొత్తగా పార్టీలోకి చేరుతున్న తాజా మాజీ ఎమ్మెల్యేలతో పాత నేతల్లో సైతం మరింత పీక్ కు చేరుతుందంట. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంట్రీతో తమ టికెట్ ఎక్కడ గల్లంతవుతుందో అని తెగ ఆందోళన చెందుతున్నారంట ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ ఆశావహులు.

మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆందోళన మొదలైంది. కనీసం సెకండ్ లిస్టులో అయినా తమ పేర్లు ఉంటాయో లేదో.. ప్రచారం చేసుకోవాలో లేదో అని ఆందోళన చెందుతున్నారు కాంగ్రెస్ నేతలు. అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే.. తాము మాత్రం ఇంటికే పరిమితం కాకతప్పడం లేదని.. ఎప్పుడు ఏ నిమిషాన ఏ సమాచారం వినాల్సి వస్తుందో అని వణికిపోతున్నారంట. ఆయా నియోజకవర్గాల ఆశవాహుల ఆశలు దక్కేనా.. లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే లు , మాజీ ఎమ్మెల్యేల ఎంట్రీతో ఆశలు గల్లంతవడం ఖాయమా అన్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పదికి పది నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ అదిష్టానం. అధినాయకత్వం ఆలోచన ఎలా ఉన్నా.. టికెట్ల ఖరారు ఆలస్యం అవుతుండటంతో ఆశావహుల్లో మాత్రం టెన్షన్ పీక్స్ చేరుతుంది. ఫస్ట్ లిస్ట్ లో ఎలాంటి వర్గపోరు లేని మంచిర్యాల, బెల్లంపల్లి, నిర్మల్ స్థానాలను మాత్రమే ఖరారు చేసింది అధిష్టానం. మిగిలిన ఏడింటిలో టికెట్ పోటీ తీవ్రంగా ఉండటం, వర్గ పోరు అంతకు మించి‌ అన్నట్లుగా ఉండటం.. ఇది చాలదన్నట్టు బీఆర్ఎస్‌లో టికెట్ దక్కని‌ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం హస్తం తీర్థం పుచ్చుకోవడంతో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే రెండవ లిస్ట్ పై హై టెన్షన్ నెలకొంది. ఎవరికి టికెట్ దక్కుతుందో.. ఎవరి బరిలో నిలుస్తారో.. టికెట్ రాకపోతే మా పరిస్థితి ఏంటో.. అన్న ఆందోళనే ఆశావహుల్లో కనిపిస్తోంది. దీంతో ప్రచారానికి పులిస్టాప్ పెట్టి అధిష్టానం కబురు కోసం ఎదురుచూస్తున్నారు.

ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ నేత కంది‌శ్రీనివాస్ రెడ్డి, బోథ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఖానాపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆసిపాబాద్ లో శ్యాంనాయక్ , ముధోల్ లో మాజీ ఎమ్మెల్యే నారయణ రావు పటేల్‌ల ఎంట్రీతో ఇన్నాళ్లు తమకే టికెట్ పక్కా అనుకుని గల్లీ గల్లీ చుట్టేసిన నేతలు డైలామాలో పడక తప్పలేదు. పారాచూట్ నేతలకే టికెట్లు దక్కితే.. ఇక మా దారి గోదారే అన్న ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు విస్తృతంగా గడపకు గడపకు ప్రచారం చేసిన నేతలు సైతం టికెట్ల ప్రకటన వరకు ఎదురు చూడాల్సిందే అని సైలెంట్ అయిపోయారంట. ఒక వేళ టికెట్ రాకుంటే ఏం చేయాలన్న విషయంపై అనుచరులు, కార్యకర్తలతో విస్తృత చర్చలు సైతం కొనసాగిస్తున్నారంట.

మరోవైపు కామ్రేడ్లతో పొత్తుల నేపథ్యంలో చెన్నూరు నియోజక వర్గం సీపీఐకి వెళ్లనుందన్న సమాచారంతో ఇన్నాళ్ళు కోటి ఆశలతో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ చెన్నూరు విషయంలో తీవ్ర ఆవేధనతో కొనసాగుతుంది. టికెట్ గల్లంతు సమాచారంతో ఇన్నాళ్లు గల్లీ గల్లీ చుట్టేసిన నేతలు ఒక్కసారిగా డీలా పడిపోక తప్పలేదు. టఉమ్మడి ఆదిలాబాద్ లో మెజారిటీ స్థానంలో నెగ్గాల్సిందే అనే అంచనాలతో ఉన్న హస్తం అధిష్టానం.. చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. ఎందరు ఆశావహుల ఆశలను ఆవిరి చేస్తుందో ఎవరికి పట్టం కడుతుందో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…