Telangana Election Results: ఆ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చిన ప్రజలు.. మొత్తం 9 మంది..
ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో ప్రజలు వినూత్న తీర్పునిస్తున్నారు. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చారు. తమ ఓటు హక్కు పవర్ ఏంటో రుచి చూపించారు. ఇతర పార్టీల్లో విజయం సాధించి పార్టీ మారిన వారిని ఈసారి ఓటర్లు ఇంటికి పంపించారు. వీరిలో పలువురు కీలక నాయకులు ఉన్నారు. తమ ఓటు పవర్ ఎంటో చాటి చెప్పారు.
![Telangana Election Results: ఆ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చిన ప్రజలు.. మొత్తం 9 మంది..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/12/ts-elections-1.jpg?w=1280)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 21 స్థానాల్లో విజయం సాధించగా 43 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఇక బీఆర్‌ఎస్ ఇప్పటి వరకు కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించగా, మరో 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో ప్రజలు వినూత్న తీర్పునిస్తున్నారు. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చారు. తమ ఓటు హక్కు పవర్ ఏంటో రుచి చూపించారు. ఇతర పార్టీల్లో విజయం సాధించి పార్టీ మారిన వారిని ఈసారి ఓటర్లు ఇంటికి పంపించారు. వీరిలో పలువురు కీలక నాయకులు ఉన్నారు. తమ ఓటు పవర్ ఎంటో చాటి చెప్పారు.
కొత్తగూడెంలో వనమా, పినపాకలో రేగా కాంతారావు ఓటమి చవి చూశారు. ఇక ఇల్లందులో హరిప్రియ, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్యలను ఓటర్లు తిరస్కించారు. వీరితో పాటు భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణ, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. పాలేరులో ఉపేందర్ రెడ్డి, ఎల్లారెడ్డిలో సురేందర్ ఓటమి పాలయ్యారు. అలాగే కొల్లాపూర్‌లో హర్షవర్దన్ ఓడిపోయారు. ఇలా గత ఎన్నికల్లో గెలిచి పార్టీ మారిన 9మంది ఎమ్మెల్యేలకు ఈసారి ఓటమి తప్పలేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :