Sai Pallavi: సాయి పల్లవి వల్లే నా డాన్స్ ఇంప్రూవ్ అయ్యింది.. : నాగ చైతన్య
తండేల్ సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించారు. అలాగే సాయి పల్లవి తన డాన్స్ తో మెప్పించింది. తాజాగా సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ చేయడం గురించి నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
Updated on: Feb 18, 2025 | 8:47 PM

నటనతో పాటు డాన్స్ లోనూ సాయి పల్లవితోపు అనే చెప్పాలి. తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించిన స్టార్ గా మారింది సాయి పల్లవి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. రీసెంట్ గా తమిళ్ లో అమరన్.. తెలుగులో తండేల్ సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకుంది.

తండేల్ సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించారు. అలాగే సాయి పల్లవి తన డాన్స్ తో మెప్పించింది.

తాజాగా సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ చేయడం గురించి నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. లవ్ స్టోరీ విడుదలైన నాలుగు సంవత్సరాల తర్వాత, నాగ చైతన్య మరియు సాయి పల్లవి ఇప్పుడు తండేల్ సినిమాలో కలిసి నటించారు.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమాలో చైతన్య మత్యకారుడి పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమాలో అందమైన ప్రేమకథను చూపించాడు దర్శకుడు. ఈ సినిమాలో సాయి పల్లవి అద్బుతంగా నటించింది.

సాయి పల్లవితో కలిసి సీన్ చేయాలన్నా, డ్యాన్స్ వేయాలన్నా తనకు ఎక్కడ లేని టెన్షన్ వస్తుందని, ఓ రకంగా తన డ్యాన్స్ ఇంప్రూవ్ అవడానికి కారణం పల్లవి అనే చెప్పొచ్చని చైతూ అన్నాడు. ప్రతీ సన్నివేశం పూర్తవగానే వెంటనే మానిటర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సీన్ బాగా వచ్చిందో లేదో చూసి బాలేకపోతే మరోసారి రీటేక్ చేద్దామంటుందని, ఆమె లాంటి హీరోయిన్ ను తానెప్పుడూ చూడలేదని, పల్లవికి వర్క్ పట్ల ఎంతో డెడికేషన్ ఉందని నాగ చైతన్య తెలిపాడు.




