- Telugu News Photo Gallery Cinema photos Top tollywood heroes like Naga Chaitanya, Ravi Teja, Teja Sajja who get 100croes colletions
ఇండస్ట్రీలో పెరుగుతున్న వంద కోట్ల హీరోలు.. తగ్గేదేలే..
వంద కోట్ల సినిమా అంటే ఒకప్పుడు భలే క్రేజ్. కానీ ఇప్పుడు... అందరికీ అందుబాటులో ఉన్న గోల్. పర్ఫెక్ట్ కథ, కథనం, డేట్ చూసి కొట్టాలేగానీ, సక్సెస్ పండును అందుకోవడం చాలా తేలిక. అందుకోవడం ఈజీయే, కానీ, ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం అంత వీజీ కాదంటున్నారు ట్రేడ్ పండిట్స్.
Updated on: Feb 18, 2025 | 8:17 PM

వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ఉప్పెన. రావడం రావడమే 100 కోట్ల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోగా పేరు తెచ్చుకున్నారు మెగా మేనల్లుడు. కానీ ఆ తర్వాత ఏం చేశారంటే.. నో ఆన్సర్. రవితేజ ధమాకా చూసి.. నియర్ ఫ్యూచర్‌లో ఇక తిరుగు లేదనుకున్నారు. బట్, వాట్ నెక్స్ట్ అంటే.. ఆ రేంజ్‌ని అందుకున్న సినిమానే లేదు..

వైష్ణవ్‌తేజ్, రవితేజ మాత్రమే కాదు, వరుణ్ తేజ్ పరిస్థితి కూడా అంతే. ఎఫ్2, ఎఫ్3 తర్వాత చెప్పుకోదగ్గ హిట్టే లేదు వరుణ్‌కి. లాస్ట్ ఇయర్ హనుమాన్‌తో ప్యాన్ ఇండియా అటెన్షన్ తెచ్చుకున్న తేజ సజ్జా ఇప్పటిదాకా ఇంకే సినిమానూ రిలీజ్ చేయలేదు.

సో, నెక్స్ట్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంది తేజ సజ్జా. ఇప్పుడు తండేల్ తర్వాత చైతూ కూడా ఇలాంటి కేర్ తీసుకోవాల్సిందే. చైతన్య కెరీర్‌లో తొలి వంద కోట్ల సినిమా తండేల్.

అటు సిద్ధు జొన్నలగడ్డ లైఫ్‌లో టిల్లు మూవీని మర్చిపోలేరు. టిల్లు స్క్వేర్‌తో వంద కోట్లు దాటి మంచి హైలో ఉన్నారు సిద్ధు జొన్నలగడ్డ. వీరిద్దరూ నెక్స్ట్ సైన్ చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహాలిస్తున్నారు ఫ్యాన్స్.

కార్తికేయ కాన్సెప్ట్ తో ప్యాన్ ఇండియా అటెన్షన్ తెచ్చుకున్నారు నిఖిల్. ఆ తర్వాత చేసిన ఒకట్రెండు అటెంప్టులు ఫెయిల్ అయినా, వాటిని నిఖిల్ ఖాతాలో డైరక్ట్ గా వేయలేం అన్నది క్రిటిక్స్ మాట. కాకపోతే, ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలను బట్టి, ఆయన ఫ్యూచర్ డిసైడ్ అవుతుందన్నది మాత్రం అందరూ నమ్ముతున్న విషయం.




