AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆధిపత్యం కోసం టీడీపీ.. పట్టు సడలకుండా వైసీపీ.. లోకల్‌బాడీ టగ్ ఆఫ్ వార్!

లోకల్‌వార్‌లో థంపింగ్ విక్టరీలతో దూసుకుపోతోంది టీడీపీ. అధికారంలోకి వచ్చి ఏడెనిమిది నెలలే ఐనా మున్సిపల్ కార్పొరేషన్లలో మాంచి మెచ్యూరిటీతో గేమ్ ఆడుతూ.. సత్తా చాటుకుంటూ వస్తోంది. ఇదేమని అడుగుతున్న ఎగస్పార్టీకి మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్షా..! అని బదులూ వస్తోంది.

ఆధిపత్యం కోసం టీడీపీ..  పట్టు సడలకుండా వైసీపీ.. లోకల్‌బాడీ టగ్ ఆఫ్ వార్!
Ys Jagan Cm Chandrababu
Balaraju Goud
|

Updated on: Feb 18, 2025 | 10:12 PM

Share

ఎప్పటికప్పుడు అప్‌డేట్ కానోడు ఎప్పటికీ ఎదగలేడు.. ఎక్కడున్నోడు అక్కడే ఆగిపోతాడు.. ఇవాళా రేపూ పాలిటిక్స్‌ కూడా అంతే..! కాంపిటిషన్‌ను బట్టి కమిట్‌మెంటూ పెరగాలి. కసీ పెరగాలి. టెస్టు మ్యాచ్‌ల్లా సోసోగా ఆడితే కుదరదు. ఎందుకంటే.. ఇది ట్వంటీట్వంటీ సీజన్. ఆడే ప్రతీ ఓవరూ సూపర్ఓవరే అనుకోవాలి.. బంతి గాల్లో ఎగరాలి. బౌండరీ దాటాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు అనేదే మన కాన్సెప్టు. స్వయానా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పార్టీ లీడర్లకిచ్చిన ఉపదేశమిది..! ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు షురూ అయిన లోకల్‌వార్ బ్యాక్‌గ్రౌండ్ కూడా అచ్చంగా అదే..! ట్వంటీ20ని మించిపోతోంది అక్కడ స్పీడు. నంబర్ మనవైపు ఉందా లేదా అని కాదు.. బుల్లెట్ దించామా లేదా.. అదీ మేటర్..! ఔను.. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో బీపీ మెషిన్లు బద్దలైపోతున్నాయి. ఇంట గెలవడానికే రచ్చరచ్చవుతోంది. ఆధిపత్యం కోసం తెలుగుదేశం పార్టీ పాకులాడుతుంటే.. బిగిసిన పట్టు సడలకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ టగ్‌ ఆఫ్ వార్‌లో చివరికి యాజ్ యూజువల్ అధికారపార్టీనే గెలుపు ఢంకా మోగిస్తోంది. ఇప్పటికే డజనుకు పైగా మున్సిపల్ కార్పొరేషన్లలో కూటమి పార్టీలదే హవా నడిచింది. మేయర్లు, డిప్యూటీ మేయర్ కుర్చీలన్నీ టీడీపీ క్యాండేట్లే ఎగరేసుకుపోతున్నారు. నయానో భయానో ఒప్పించి.. సామధాన బేధ దండోపాయాల్లో ఏదో ఒకటి ప్రయోగించి అటు వాళ్లను ఇటు లాక్కుని.. ఎత్తర జెండా అనేస్తోంది రూలింగ్ పార్టీ. బేల చూపులతో బిక్కచచ్చిపోవడం వైసీపీ వంతైంది. తునిలో తాజా పరిణామాలు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి