Harish Rao: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరువు, కర్ఫ్యూ లేదు.. కేసీఆర్ చరిత్ర సృష్టించబోతున్నారుః హరీష్ రావు
ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎంత నిజాయితీగా పనిచేశామో...తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా అంతే నిబద్ధతతో పని చేస్తున్నామని అన్నారు మంత్రి హరీష్ రావు. కార్యదక్షత కలిగి కేసీఆర్ లాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉండడమే దీనికి కారణమన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉందన్నారు.

ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎంత నిజాయితీగా పనిచేశామో…తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు తాజా మాజీ మంత్రి హరీష్ రావు. కార్యదక్షత కలిగి కేసీఆర్ లాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉండడమే దీనికి కారణమన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉందన్నారు. అభివృద్ధికి అవార్డులు ప్రకటిస్తే అవి తెలంగాణ రాష్ట్రానివేనని చెప్పారు హరీష్ రావు. దేశానికి ఆదర్శంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారని తాజా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారన్నారు. తెలంగాణలో సుస్థిర పాలన కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు.
కేసీఆర్ పాలనను మెచ్చుకుంటూ కేంద్రం ఇచ్చిన అవార్డులే ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు అభివృద్దిలో తెలంగాణ దరిదాపుల్లో లేవని తెలిపారు. ఎన్నికల ఇచ్చిన హామీలతో పాటు చెప్పని పనులు కూడా చేస చూపిన ఘనత కేసీఆర్ సొంతం అన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కేసీఆర్ బీమా, రైతుబంధు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి చేశామన్నారు. గత కాంగ్రెస్ పాలనను నేటి కేసీఆర్ పాలనను బేరీజు వేసుకొని ప్రజలు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు హరీష్.
గతంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండేదని.. మనం ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకున్నట్టు చెప్పారు హరీష్ రావు. 24 గంటల నిరంతర విద్యుత్ తో ఎన్నో సమస్యలను అధిగమించామన్నారు. కేసీఆర్ విజన్ కారణంగానే తెలంగాణలో విద్యుత్ సమస్య తొలగిపోయిందన్న హరీష్ రావు.. నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంతో రైతులు అన్ని కాలాల్లో పంటలు పండించుకుంటున్నారన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికీ కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు. రెండు, మూడు గంటల కంటే ఎక్కువ కరెంటు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రైతుబంధు కింద దాదాపు రూ. 72వేల కోట్లు నగదు బదిలీ జరిగిందన్నారు హరీష్. భూగర్భ జలాలను పెంచడంతో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం పండే రాష్ట్రంగా మారిందన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో తెలంగాణ దేశానికే అదర్శంగా నిలుస్తుందన్నారు హరీశ్. బస్తీ దవఖానాలతో పాటు పల్లె దవాఖానాలు, ప్రతి జిల్లా, నగరాల్లోని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. ఎంబీబీఎస్ సీట్లను 10వేల సీట్లకు పెంచాం. విదేశాలకు వెళ్లకుండా ఈ సౌలభ్యం తెచ్చిన ఘనత భారాస ప్రభుత్వానిది. విద్యలో గుణాత్మక మార్పు తీసుకొచ్చాం. గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా తీర్చిదిద్దాం. ఆంగ్ల మాధ్యమంలో బోధన, కార్పొరేట్ స్థాయి వసతులను పాఠశాల్లో కల్పించేందుకు కృషి చేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు.
Minister Harish Rao meet the Press
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
