Telangana Election: గెలిపించకపోతే కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటా.. బీఆర్ఎస్ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు
హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఓటర్ల వద్ద ఎమోషనల్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తనను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించక పోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఓటర్లు ఓటేసి దీవిస్తే డిసెంబర్ 4వ తేదీన జైత్రయాత్ర నిర్వహిస్తానని, గెలిపించకుంటే తమ కుటుంబ సభ్యుల శవయాత్ర చేసుకుంటామన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి అంకానికి చేరుకుంది. మంగళవారంతో ఎన్నికల ప్రచారం పర్వానికి తెరపడనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా-నేనా అన్నట్లు పోటాపోటీగా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని విషయాలు లెక్కలు వేసుకున్న ఓటర్లు.. నవంబర్ 30వ తేదీన తీర్పునిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రచారం ఒక ఎత్తు అయితే.. ఈ 48 గంటలు అభ్యర్థులకు చాలా కీలకం కానుంది.
ఈ క్రమంలోనే హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఓటర్ల వద్ద ఎమోషనల్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తనను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించక పోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఓటర్లు ఓటేసి దీవిస్తే డిసెంబర్ 4వ తేదీన జైత్రయాత్ర నిర్వహిస్తానని, గెలిపించకుంటే తమ కుటుంబ సభ్యుల శవయాత్ర చేసుకుంటామన్నారు. కమలాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబ సభ్యులు ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి..
ఇదిలావుంటే, ఓటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల అధికారులు అదనపు బలగాలను మోహరించారు.
మరి న్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
