Army Man Missing: ఆర్మీ జవాన్ మిస్సింగ్.. వారం రోజులుగా స్విచ్ఛాప్‌లో ఫోన్.. టెన్షన్‌లో పోతిరెడ్డిపల్లి గ్రామం..!

నిరుపేద రైతు కుటుంబానికి చెందిన పటెల్ రెడ్డి కుమారుడు సాయి కిరణ్ రెడ్డి.. అతను విద్యాభ్యాసం కొనసాగుతుండగా ఫీజు కట్టలేని దుస్థితిలో ఉన్న సమయంలో ఆర్మీలో చేయాలన్న తపన సైన్యంలో చేరేలా చేసింది.

Army Man Missing: ఆర్మీ జవాన్ మిస్సింగ్.. వారం రోజులుగా స్విచ్ఛాప్‌లో ఫోన్..  టెన్షన్‌లో పోతిరెడ్డిపల్లి గ్రామం..!
Army Jawan Missing
Follow us

|

Updated on: Dec 13, 2021 | 7:11 AM

Army Man Missing: చిన్నప్పటి నుంచి ఆర్మీలో పని చేయాలన్న తపన.. దేశంపై ప్రేమ, అభిమానమే.. ఆ యువకున్ని ఆర్మీ లోకి వెళ్లేలా చేసింది. ఎన్నో కష్టాలకు ఓర్చి చిన్నవయసులోనే అతను అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఆర్మీలో ఉద్యోగం పొందాడు. భరతమాత రుణం తీర్చుకునే అవకాశం రావడం తన అదృష్టమన్నాడు. లక్ష్యం కోసం దేశ సేవలో నిమగ్నమైన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ మిస్సింగ్.. వారం రోజులైంది. పంజాబ్ రాష్ట్రంలో విధులకు వెళ్తుండగా ఉన్నట్టుండి.. ఫోన్ స్విచాఫ్, ఆ వెంటనే ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. ఆర్మీ (జవాన్) గన్నర్ కనిపించకుండా పోవడమే ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే, ఆర్మీ జవాన్ మిస్సింగ్ పై.. సాయి కిరణ్ రెడ్డి అన్న భాను ప్రకాష్ రెడ్డి, స్నేహితులు, బంధువుల కథనం ప్రకారం.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోకురి సాయి కిరణ్ రెడ్డి ఆర్మీలో పని చేస్తున్నారు.

నిరుపేద రైతు కుటుంబానికి చెందిన పటెల్ రెడ్డి కుమారుడు సాయి కిరణ్ రెడ్డి.. అతను విద్యాభ్యాసం కొనసాగుతుండగా ఫీజు కట్టలేని దుస్థితిలో ఉన్న సమయంలో ఆర్మీలో చేయాలన్న తపన సైన్యంలో చేరేలా చేసింది. పంజాబ్ రాష్ట్రంలోనీ ఫరీద్ కోట్ ప్రాంతంలో గన్నర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత ఇరవై రోజుల క్రితం సెలవుల్లో తన స్వగ్రామం పోతిరేడ్డిపల్లికి వచ్చినట్లు తెలిపారు. సెలవులు పూర్తయ్యాక అనంతరం డిసెంబర్ 7న విధులు నిర్వర్తించడం కోసం డిసెంబర్ 5న పయనమయ్యాడు. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ లో వెళ్లినట్లు తెలిపారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాతో వీడియో కాల్‌లో మాట్లాడారని సోదరుడు సోదరుడు భాను ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన సాయి కిరణ్.. తర్వాత రోజు నుంచి కంటిన్యూగా ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందన్నారు. అయినా ఇప్పటి వరకు అతన్నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని, తమకు సమాచారం కూడా అందలేదన్నారు.

సాయి కిరణ్ రెడ్డి మిస్సింగ్ పై.. స్థానికంగా మా ప్రాంతంలో ఉండే చేర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. జీరో ఎఫ్ఐఆర్ చేసిన చర్యలు పోలీసులు ఈ కేసును ఢిల్లీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అత్యున్నత హోదాలో ఉండి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ ఘటన మరువకముందే.. దేశం కోసం సేవ చేసే ఒక ఆర్మీ జవాన్ మిస్ అయిండన్న బాధ మేధావులు, యువతను కలచివేస్తున్నట్లు పలువురు పేర్కొన్నారు. ఆర్మీ జవాన్ గన్నర్ సాయికిరణ్ రెడ్డి మిస్సింగ్ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచూకీ కనుగొనే దిశగా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. మా తమ్ముడు అడ్రస్ తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీడియా సైతం తమ కుటుంబానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాయి కిరణ్ రెడ్డి ఎక్కడ ఉన్నా.. క్షేమంగా ఉండాలని, క్షేమ సమాచారాన్ని ఈ క్రింది నెంబర్లకు 93814 95986, 95052 49282 ఫోన్ చేయాలని కోరుతున్నారు.

Also Read: Harish Rao: తెలంగాణలో మెరుగైన వైద్యం అందేలా వసతుల కల్పన.. వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీష్ వరుస సమీక్షలు

Telangana News: శంకర్‌దాదాను మించిన డాక్టర్‌.. ఆర్‌ఎంపీ గైనకాలజిస్ట్‌.. సిత్రాలు సిన్నగ లేవండోయ్..!