Shilpa Chowdary: వందల కోట్లు కొల్లగొట్టిన శిల్పచౌదరి అకౌంట్స్‌లో ఇప్పుడు ఎంత మనీ ఉంది? పోలీసులకు ఏంచెప్పింది!
Shilpa Chowdary police custody: శిల్పాచౌదరి మూడ్రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. మూడ్రోజుల పాటు విచారించిన పోలీసులు.. ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపర్చనున్నారు.
Shilpa Chowdary Cheating Case: శిల్పాచౌదరి మూడ్రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. మూడ్రోజుల పాటు విచారించిన పోలీసులు.. ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపర్చనున్నారు. కస్టడీకి తీసుకున్న పోలీసులు.. శిల్పాచౌదరి నుంచి పలు కీలక వివరాలను సేకరించారు. ఆమె ఖాతాలో రూ.16 వేలు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ. 14వేలను పోలీసులు గుర్తించారు. శిల్ప ఇప్పటివరకు కోట్లలో మోసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
కిట్టీ పార్టీల పేరుతో కోట్లు కొల్లగొట్టిన కిలాడీ లేడీ శిల్పాచౌదరి కేసులో మరిన్ని కన్నింగ్ కథలు బయటికి వస్తున్నాయ్. సెకండ్ టైమ్ పోలీస్ కస్టడీలో శిల్పాచౌదరి తన కంత్రీ మైండ్‌తో పోలీసులనే ఆటాడుకుంది. ఇంటరాగేషన్‌లో అడిగిన ప్రశ్నలకు శిల్ప ఉక్కిరిబిక్కిరైంది. కానీ, పెద్దగా నోరు తెరవలేదంటున్నారు పోలీసులు. పైగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగింది. మూడ్రోజుల పోలీస్ కస్టడీలో శిల్ప మనీ ట్రాంజాక్షన్స్‌పై కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా రాబట్టలేకపోయారు. ప్రస్తుతం శిల్పాచౌదరి అకౌంట్‌లో 16వేలు, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో కేవలం 14వేలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు.
వందల కోట్లల్లో మోసం చేసిందని కంప్లైంట్ వచ్చినా…. ఇప్పటివరకు మూడు కేసుల్లో ఏడు కోట్ల రూపాయల లెక్క మాత్రమే తేలింది. ఈ ఏడు కోట్లూ తిరిగిచ్చేస్తానని పోలీసులతో శిల్ప చెప్పినట్టు టాక్. ఈ ఏడు కోట్లలో మూడు కోట్లకు పైగా ఒక్క ప్రియదర్శినికే ఎగ్గొట్టింది శిల్ప. మరోవైపు రాధికారెడ్డి ఎపిసోడ్ కూడా ఈ కేసులో కీలకంగా మారింది. అధిక వడ్డీ ఇస్తాననడంతోనే పది కోట్లకు పైగా రాధికకు ఇచ్చానంటోంది శిల్ప. కానీ, సరైన ఆధారాలు ఇవ్వకపోవడంతో శిల్పా మోసాలపై మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు నార్సింగి పోలీసులు. ఇప్పటివరకు చేసిన దర్యాప్తు ప్రకారం శిల్పాచౌదరి 32కోట్ల వరకు మోసం చేసినట్లు గుర్తించారు. అమెరికాలో మూడేళ్లపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసొచ్చిన శిల్ప… ఇండియాకి తిరిగొచ్చి మోసాలకు పాల్పడటం మొదలుపెట్టిందని, సంపన్నులే టార్గెట్‌గా తన కుట్రల్ని అమలు చేసిందని పోలీసులు చెబుతున్నారు.