Heat Wave: సెగలు రేపుతున్న సూర్యుడు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, ఎల్లో అలర్ట్ జారీ
ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ కు పెరిగిపోవడంతో రాష్ట్రంలో భారీ ఎండలు నమోదై అవకాశం ఉన్నందున ప్రజలను హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ తెలంగాణలో వడగాల్పులపై ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో బయటకు రావొద్దని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ కు పెరిగిపోవడంతో రాష్ట్రంలో భారీ ఎండలు నమోదై అవకాశం ఉన్నందున ప్రజలను హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ తెలంగాణలో వడగాల్పులపై ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో బయటకు రావొద్దని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా చక్కెరతో పానీయాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఎందుకంటే అవి ఎక్కువ శరీర ద్రవాలను కోల్పోవటానికి దారితీస్తాయి. ఇక కడుపు తిమ్మిరికి కారణమవుతాయి.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు సమకూర్చేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏఎన్ ఎంలు, ఆశావర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలతో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసింది తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
వడదెబ్బ మీ శరీర చల్లబరిచే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరుబయట వెళ్లాల్సి వస్తే టోపీ, సన్ గ్లాసెస్ ధరించడం మరిచిపోవద్దు. బయటకు వెళ్ళడానికి 30 నిమిషాల ముందే లోషన్ ను రాసుకోవాలి. దీంతో కొంత ఎండ బారి నుంచి కాపాడుకోవచ్చు. ఇక కార్లలో పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. కిటికీలు తెరిచి ఉన్నప్పటికీ కార్లలో ఉష్ణోగ్రతలకు త్వరగా వేడెక్కుతాయి. పార్క్ చేసిన కారులో ఎవరైనా ఉంటే వడదెబ్బకు గురయ్యే లేదా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కనీస జాగ్రత్తలు తప్పనిసరి అని అంటున్నారు అధికారులు.