Telangana BJP: టికెట్ కోసం మొదటి రోజు 182 దరఖాస్తులు.. అలాంటి వారి అప్లికేషన్లు పక్కనపెట్టాలంటూ కిషన్ రెడ్డి హుకూం..

|

Sep 04, 2023 | 9:18 PM

తెలంగాణలో ఎన్నికల హీట్‌ పెరిగింది. ఓవైపు జమిలి ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతున్నా.. మరోవైపు ఎప్పుడైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చు అనే ఉత్కంఠ నెలకొంది. ఇక, ఒకేసారి 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి మరింత హీట్‌ పెంచారు BRS అధినేత, సీఎం కేసీఆర్‌. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టి, దరఖాస్తుల స్వీకరించింది.

Telangana BJP: టికెట్ కోసం మొదటి రోజు 182 దరఖాస్తులు.. అలాంటి వారి అప్లికేషన్లు పక్కనపెట్టాలంటూ కిషన్ రెడ్డి హుకూం..
Telangana BJP
Follow us on

హైదరాబాద్, సెప్టెంబర్ 04: తెలంగాణలో ఎన్నికల హీట్‌ పెరిగింది. ఓవైపు జమిలి ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతున్నా.. మరోవైపు ఎప్పుడైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చు అనే ఉత్కంఠ నెలకొంది. ఇక, ఒకేసారి 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి మరింత హీట్‌ పెంచారు BRS అధినేత, సీఎం కేసీఆర్‌. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టి, దరఖాస్తుల స్వీకరించింది. పోటీపడుతున్న ఆశావహుల పరిస్థితులను బేరీజు వేసి లిస్టు రెడీ చేసింది. ఇక కమలం పార్టీ కూడా అభ్యర్థుల ఎంపిక కోసం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. నాంపల్లి బీజేపీ ఆఫీసులో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి, దరఖాస్తులను స్వీకరిస్తోంది.

నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకూ దరఖాస్తులను తొలిరోజు స్వీకరించారు. సికింద్రాబాద్ నుంచి రవి ప్రసాద్ తొలి దరఖాస్తును అందజేశారు. కౌంటర్‌ ఇంచార్జ్‌లు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, GHMC మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, మల్లేష్ ఉన్నారు. మొత్తం 63 మంది ఆశావాహులు మొత్తం 182 దరఖాస్తులను దాఖలు చేశారు. ఒక్కో అభ్యర్థి రెండు, మూడు నియోజకవర్గాలకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది..

ఈనెల 10వ తేదీతో దరఖాస్తుల గడువు ముగింపు

దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 10వ తేదీతో గడువు ముగియనుంది. ఇప్పటివరకు 300 మందికి దరఖాస్తులు పంపిణీ చేశారు. తొలి దరఖాస్తును సికింద్రాబాద్ నుంచి రవి ప్రసాద్‌గౌడ్‌ అందజేశారు. సామ రంగారెడ్డి ఎల్బీనగర్‌ నుంచి అప్లై చేయగా, వేములవాడ నుంచి తుల ఉమ అభ్యర్థిగా దరఖాస్తు చేశారు.

ఇవి కూడా చదవండి

మొదటి పార్ట్‌లో బీజేపీలో ఎప్పుడు చేరారు?

బీజేపీ దరఖాస్తు ఫారంలో మొత్తం 4 పార్ట్‌లు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో బీజేపీలో ఎప్పుడు చేరారు? వ్యక్తిగత వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పార్ట్‌-2లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం ప్రస్తావించాలి. పార్ట్‌-3లో ప్రస్తుతం పార్టీలో నిర్వహిస్తున్న బాధ్యతలను పేర్కొనాలి. ఇక పార్ట్‌4లో క్రిమినల్‌ కేసులేమైనా ఉంటే..ఆ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. మొత్తానికి బీజేపీ చరిత్రలోనే తొలిసారి ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

వారి దరఖాస్తులు పక్కనపెట్టండి.. కిషన్ రెడ్డి..

కాగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మీడియాతో మాట్లాడితే వారి అప్లికేషన్స్ పక్కన పెట్టాలని కిషన్ రెడ్డి ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న ఆశావహులు నియోజకవర్గానికి వెళ్లి పని చేసుకోవాలంటూ సూచించారు. దీంతో దరఖాస్తు చేసే నేతలు ముందుగానే అలర్ట్ అయి మీడియాతో మాట్లాడకుండానే వెనుతిరుగుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..