Telangana BJP: తెలంగాణ బీజేపీలో లొల్లి.. అసలేం జరుగుతోందంటూ ఢిల్లీ పెద్దల సీరియస్.. కీలక సూచనలు..

|

Apr 02, 2023 | 7:58 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలలు మాత్రమే టైముంది. ఏదిఏమైనాసరే ఈసారి అధికారం తమదే అంటోంది బీజేపీ. మరి, అధికారం తమదేనని ధీమాగా చెబుతోన్న టీబీజేపీలో సమన్వయం లోపిస్తోందా?. జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది.

Telangana BJP: తెలంగాణ బీజేపీలో లొల్లి.. అసలేం జరుగుతోందంటూ ఢిల్లీ పెద్దల సీరియస్.. కీలక సూచనలు..
Telangana Bjp
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలలు మాత్రమే టైముంది. ఏదిఏమైనాసరే ఈసారి అధికారం తమదే అంటోంది బీజేపీ. మరి, అధికారం తమదేనని ధీమాగా చెబుతోన్న టీబీజేపీలో సమన్వయం లోపిస్తోందా?. జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. టీబీజేపీ ఆఫీస్‌లో ముఖ్యనేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు ఢిల్లీ పెద్దలు. ఈగోలను పక్కనబెట్టి కలిసి కట్టుగా ముందుకు సాగాలని హితోపదేశం చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ముఖ్యనేతల సమావేశం జరిగింది. బండి సంజయ్‌, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌, ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి కీలక నేతలతో ఢిల్లీ నేతలు శివప్రకాష్‌, సునీల్‌ బన్సల్‌, తరుణ్‌చుగ్‌ చర్చలు జరిపారు. ఎన్నికలకు టైమ్‌ దగ్గర పడుతున్నందున సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అధికారమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు ఢిల్లీ పెద్దలు. మీటింగ్‌ తర్వాత మీడియాలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. BRS-కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయడం ఖాయమని, తాము మాత్రం సింగిల్‌గానే పోటీచేస్తాం, అధికారంలోకి వస్తామంటూ ధీమాగా చెప్పారు.

సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని బల్లగుద్దీమరి చెప్పారు బండి సంజయ్‌. పోలీసులు, అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యవహరించాలని సూచించారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే మూల్యం చెల్లించకతప్పదని బండి సంజయ్ హెచ్చరించారు.

తెలంగాణలో అధికారానికి అడుగు దూరంలో ఉన్నామని భావిస్తోన్న బీజేపీ హైకమాండ్‌, దాన్నెలాగైనా ఒడిసిపట్టుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై అభిప్రాయాలు సేకరిస్తూనే, విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని సూచిస్తోంది. మరి, ఈగోలను పక్కనబెట్టి నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగుతారా?. అధికారాన్ని సాధిస్తారా? లేదా? ఇది తేలాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే!

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..